Kushi OTT: ఖుషి ఓటీటీ డేట్ వచ్చేసింది.. విజయ్ - సమంత ఆ సీన్స్ కూడా!
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న హీరోల్లో క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ ఒకడు. ఆరంభంలోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. తన రేంజ్‌ను భారీ స్థాయిలో పెంచుకున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'ఖుషి' మూవీతో వచ్చాడు.
శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రమే 'ఖుషి'. సమంత రూత్ ప్రభు హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఆరంభంలోనే అదిరిపోయే టాక్‌ను సొంతం చేసుకుంది. అందుకు అనుగుణంగానే ప్రేక్షకుల రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని మంచి ఓపెనింగ్స్‌ను అందుకుంది. కానీ, ఆ తర్వాత ఈ చిత్రం పెద్దగా రాణించలేదు. ఫలితంగా దీనికి కలెక్షన్లు అనుకున్న విధంగా రాలేదు. దీంతో నష్టాలతోనే రన్‌ను ముగించాల్సి వచ్చింది.

సమంత - విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఖుషి' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను కళ్లు చెదిరే ధరకు కొనుగోలు చేసింది.
బిజినెస్ డీల్ జరుపుకున్న సమయంలోనే 'ఖుషి' మూవీని థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. అంటే సెప్టెంబర్ 1న విడుదలైన 'ఖుషి' మూవీ అక్టోబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 6న దీన్ని తీసుకు వస్తారని అన్నారు.

'ఖుషి' మూవీ ఓటీటీ డేట్‌పై ఎన్నో ప్రచారాలు జరుగుతోన్న నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ సంస్థ తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వదిలింది. ఇందులో ఈ చిత్రాన్ని అక్టోబర్ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకు రాబోతున్నట్లు తెలిపింది. అంటే కరెక్టుగా నెల రోజుల తర్వాతనే దీన్ని తీసుకు వస్తున్నారు. ఇక, ఇందులో సెన్సార్ కాని వెర్షన్‌ను అందుబాటులోకి తెస్తున్నారట. ఫలితంగా సమంత, విజయ్ సీన్స్ మరిన్ని ఇందులో చూపించబోతున్నారు.

ఇదిలా ఉండగా.. 'ఖుషి' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. దీనికి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించాడు. ఇందులో సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రలను పోషించారు.


Click it and Unblock the Notifications











