Kushi OTT: ఆ ఓటీటీలోకి వచ్చేసిన ఖుషి.. ఫ్యాన్స్‌కు అసలైన సర్‌ప్రైజ్ ఏంటంటే!

టాలీవుడ్‌లో ఇప్పుడు చాలా మంది మీడియం రేంజ్ హీరోలు ఉన్నారు. అందులో ఒకరిద్దరు మాత్రమే ఫలితాలతో పని లేకుండా తమ రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నారు. అలాంటి వారిలో క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ ఒకడు. అతి కష్టం మీద సినిమాల్లోకి వచ్చిన ఈ యంగ్ హీరో.. అనతి కాలంలోనే స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. దీంతో వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్న విజయ్ దేవరకొండ.. ఇటీవలే 'ఖుషి' అనే చిత్రంతో వచ్చాడు. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీలో సమంత రూత్ ప్రభు హీరోయిన్‌గా చేసింది. దీంతో ఆరంభంలోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ మంచి టాక్‌తో పాటు ఓపెనింగ్స్ అందుకుంది.

Vijay Deverakonda Starrer Kushi Movie Streaming Started on Netflix

ఆరంభంలో మంచిగానే రాణించిన 'ఖుషి' మూవీ.. ఆ తర్వాత క్రమంగా డౌన్ అయిపోయింది. ఫలితంగా ఓవర్సీస్‌లో మినహా ఎక్కడా ఇది సరిగా రాణించలేదు. ఫలితంగా కొంత నష్టాలతోనే రన్‌ను ముగించాల్సి వచ్చింది. ఇక, థియేటర్లలో ఆశించిన రీతిలో రాణించలేకపోయిన ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరిగిన విషయం తెలిసిందే.

సమంత - విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందిన 'ఖుషి' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడడంతో దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను కళ్లు చెదిరే ధరకు కొనుగోలు చేసింది. ఇటీవలే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను సైతం అనౌన్స్ చేసింది.

Vijay Deverakonda Starrer Kushi Movie Streaming Started on Netflix

ఇటీవలే ప్రకటించినట్లుగానే విజయ్ దేవరకొండ - సమంత నటించిన 'ఖుషి' మూవీని అక్టోబర్ 1 అంటే నేటి అర్ధరాత్రి నుంచే నెట్‌ఫ్లిక్స్ సంస్థ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో సెన్సార్ కాని వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా సమంత, విజయ్ మధ్యన వచ్చే చాలా సీన్స్ జత చేశారని అంటున్నారు. ఇది నిజంగా వీళ్లిద్దరి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ అనే చెప్పాలి.

Vijay Deverakonda Starrer Kushi Movie Streaming Started on Netflix

ఇదిలా ఉండగా.. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'ఖుషి' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. దీనికి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించాడు. ఇందులో సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X