Varasudu OTT: ఏకంగా రెండు ఓటీటీల్లో విజయ్ 'వారసుడు'.. మరికొన్ని రోజుల్లోనే రిలీజ్!

తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. పేరుకు కోలీవుడ్ హీరో అయిన విజయ్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. విజయ్ ని అతని అభిమానులు ముద్దుగా ఇళయదళపతి అని పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల బీస్ట్ సినిమాతో ఓటమి చవిచూసిన విజయ్ లేటెస్ట్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ వారసుడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా తెలుగు వెర్షన్ జనవరి 14న తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. తెలుగులో మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న విజయ్ వారసుడు సినిమా అతి కొద్ది రోజుల్లో ఓటీటీలో సందడి చేయనుంది.

మాస్టర్, బీస్ట్ చిత్రాల తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ 'వారసుడు'. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రానికి ఎస్ తమన్ సంగీతం అందించాడు. ఇందులో శ్రీకాంత్, శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కిక్ శ్యామ్, కుష్బూ, జయసుధ, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ద్విభాష చిత్రంగా రూపొందిన విజయ్ వారసుడు సినిమా తెలుగు వెర్షన్ జనవరి 14న రిలీజ్ కాగా.. తమిళ వెర్షన్ జనవరి 11నే విడుదలైంది. ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆడకపోయిన తమిళంలో మాత్రం మంచి విజయం సాధించింది.

 Vijay Dil Raju Varasudu Movie OTT Release On Amazon Prime Video And Sun NXT

తెలుగులో వారసుడు, తమిళంలో వారిసు టైటిళ్లలతో విడుదలైన ఈ చిత్రం తమిళంలో విజయ్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఫైనల్ రన్ లో రూ. 200 కోట్లకుపైగా వసూళు చేసింది. అయితే తెలుగులో మాత్రం అంతగా విజయం సాధించలేదు. విజయ్ 66వ చిత్రంగా వచ్చిన ఈ సినిమా ఓటీటీ విడుదలపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఇప్పటికే విజయ్ వారసుడు సినిమా ఓటీటీ విడుదలపై అనేక రూమర్స్ వచ్చినప్పటికీ తాజాగా అధికారికంగా ప్రకటించింది ఆ ఓటీటీ సంస్థ. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 22 నుంచి తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

విజయ్ వారిసు చిత్రం కేవలం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రమే కాకుండా మరొక ఓటీటీలో కూడా సందడి చేయనుంది. అదే ఫిబ్రవరి 22న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సన్ ఎన్ఎక్స్ టీ (SUN NXT)లో విడుదల కానుంది. అయితే ఈ సన్ ఎన్ఎక్స్ టీ ఫ్లాట్ ఫామ్ లో కేవలం యూఎస్ లో మాత్రమే ప్రీమియర్ చేయబడుతుందని ఇదీవరకే ప్రకటించారు. ఇండియాలో మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే దిల్ రాజు తమిళంలో నిర్మించిన మొదటి సినిమా ఇదే కాగా.. డైరెక్టర్ వంశీ పైడిపల్లికి కూడా కోలీవుడ్ లో ఇదే ఫస్ట్ మూవీ. తమిళ వెర్షన్ కు లాభాలు వచ్చినప్పటికీ.. తెలుగులో మాత్రం అంతగా రాబట్టలేకపోయింది వారసుడు సినిమా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X