LEO HD ప్రింట్ లీక్ ఎఫెక్ట్... OTT లోకి ముందే రానున్న మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇళయ దళపతి విజయ్ హీరోగా.. అందాల భామ త్రిష కృష్ణన్ హీరోయిన్ గా తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ లియో. ఇక ఈ చిత్రానికి లోకేషన్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తమిళ వర్షన్ హెచ్ డి ప్రింట్ లీక్ అయినట్లు తెలుస్తోంది. దీంతో మేకర్స్ ఆ లీక్ ఎఫెక్ట్ తో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. అయితే థియేటర్ వర్షన్ కాకుండా మళ్లీ చూసేలా తీసుకువస్తామని చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
కోలీవడ్ స్టార్ హీరో విజయ్, అందాల భామ త్రిష హీరో హీరోయిన్లుగా... లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లియో. ఇక ఈ సినిమా.. దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన థియేటర్లోకి వచ్చింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ సర్జా వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటించారు. అనిరుద్ సంగీతం అందించగా.. లలిత్ కుమార్ నిర్మించారు.

ఇక లియో చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ చిత్రానికి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రానికి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడం.. విజయ్ మాస్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. లోకేష్ తెరకెక్కించిన సినిమాటిక్ యూనివర్స్ లో ఖైదీ, విక్రమ్ సినిమాల తర్వాత లియో రావడంతో.. బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
విజయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమాకు.. ఇప్పుడిప్పుడే వసూళ్లు కాస్త నెమ్మదించాయి. ఇక ఇదిలా ఉండగా.. లియో తమిళ్ వర్షన్ హెచ్ డి ప్రింట్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇక లాస్ట్ టైం కోలీవుడ్ హిట్ చిత్రం జైలర్ కు కూడా ఇలాగే జరిగింది. అయితే వాళ్లు ఓటీటీలో రిలీజ్ ముందుగానే చేశారు. ఇక లియోకి కూడా ఇలాగే జరగడంతో.. మేకర్స్ ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఇక నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
లియో సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవ్వనుంది. నవంబర్ మూడో వారంలో రిలీజ్ కావాల్సి ఉండగా.. నవంబర్ రెండో వారంలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ ప్రేక్షకులకు ఇది గుడ్ న్యుసే. లియో సినిమా థియేటర్లలో విడుదలైన వెర్షన్ కు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమా కాస్త విభిన్నంగా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ తెలిపారు. ప్లాష్ బ్యాక్ లోని 18 నుంచి 20 నిమిషాల భాగం కేవలం ఫ్యాన్స్ కోసం మాత్రమే చిత్రీకరించిందని లోకేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకువచ్చారు.

ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమా వెర్షన్ మాత్రం దీనికి భిన్నంగా ఉంటుందని.. లోకేష్ ఇంతకు ముందు చెప్పుకువచ్చారు. క్లైమాక్స్ లో లియో తనకు తానుగా ఆంటోని దాస్ కు చెప్పే వెర్షన్ కేవలం ఓటీటీలో మాత్రమే ఉంటుందని రివిల్ చేశారు. దీంతో లియో సినిమా ఓటీటీ వెర్షన్ స్ట్రీమింగ్ కోసం అడియన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











