OTT: ఓటిటిలో దుమ్మురేపుతున్న మహారాజ.. ప్రభాస్‌కు, కల్కికి విజయ్ సేతుపతి భారీ టార్గెట్!
ఈ ఏడాదిలో ఇండియన్ సినిమా దగ్గర హిట్ సినిమాల రేషియో చూస్తే తక్కువ హిట్స్ మాత్రమే కనిపిస్తాయి అని చెప్పాలి. ఒక్క మలయాళ సినిమా మినహా తెలుగు కానీ తమిళ్ కానీ హిందీ సినిమాల మార్కెట్ లలో కూడా ఈ ఏడాది చాలా తక్కువ హిట్ శాతం కనిపిస్తుండగా. అలా డల్ గా ఉన్న సమయంలో కోలీవుడ్ సినిమా నుంచి రిలీజ్ అయ్యిన ఓ సినిమా మాత్రం మళ్ళీ థియేటర్స్ లోకి జనాన్ని తీసుకొచ్చింది.
కాగా ఆ సినిమానే వెర్సటైల్ నటుడు విజయ్ సేతుపతి నటించిన బిగ్ హిట్ చిత్రం "మహారాజ". ఈ సినిమాని దర్శకుడు నిథిలన్ తెరకెక్కించగా థియేటర్స్ లో వచ్చిన ఈ సినిమా 100 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకొని భారీ హిట్ అయ్యింది. పైగా ఇది విజయ్ సేతుపతి కెరీర్లో 50వ సినిమా కావడం అది కూడా ఇంత పెద్ద హిట్ కావడం అనేది మరింత స్పెషల్ గా మారింది. అయితే ఈ సినిమా థియేటర్స్ లో చూపించిన హవా ఓటిటిలో కూడా భారీ లెవెల్లో చూపించింది.

కాగా ఈ సినిమాని ప్రపంచ నెంబర్ 1 స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. ఇక ఇందులో ఈ సినిమా రికార్డు రెస్పాన్స్ కొల్లగొట్టినట్టుగా తెలుస్తుంది. ఈ ఏడాదిలో ఇండియన్ సినిమా నుంచి వచ్చిన ఏ సినిమా కంటే కూడా హైయెస్ట్ వ్యూస్ ని మహారాజ అందుకున్నాడట. కాగా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఏకంగా 18.6 మిలియన్ కి పైగా వ్యూస్ ని అందుకుందట.
దీనితో ఈ ఏడాదిలో ఇప్పుడు వరకు ఇదే హైయెస్ట్ రికార్డుగా నిలిచింది. అయ్యితే ఈ సినిమా తర్వాత రెండో స్థానంలో బాలీవుడ్ హిట్ సినిమాలు "క్రూ" 17.9 మిలియన్ వ్యూస్ తో అలాగే మరో చిత్రం "లాపతా లేడీస్" 17.1 మిలియన్ వ్యూస్ తో ఉన్నాయట. ఈ రకంగా అయితే ఓటిటిలో మహా రాజా సెన్సేషనల్ హిట్ అయ్యింది అని చెప్పాలి. అయితే ఇక్కడితో అయిపోలేదు.
ఇది తాజాగా వచ్చిన రెబల్ స్టార్ "కల్కి 2898 ఎడి" కి గట్టి పోటీ అని చెప్పాలి. కల్కి నేడే నెట్ ఫ్లిక్స్ లో ఒక్క హిందీలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మహారాజ కంటెంట్ పరంగా భారీ రీచ్ అందుకుంది. అలాగే పలు భాషల్లో వచ్చింది. కానీ కల్కి సింగిల్ భాషలో హిందీలో వచ్చింది, పైగా భారీ తారాగణం కూడా ఉంది. సో ఈ లెక్కల్లో రెండు సినిమాలకి ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని చెప్పడానికి లేదు.
మరి కల్కి చిత్రం మహారాజ సెట్ చేసిన ఈ బిగ్ రికార్డుని ఈ ఏడాదిలో బ్రేక్ చేస్తుందో లేదో అనేది మాత్రం వేచి చూడాల్సిందే. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించగా దీపికా పదుకొనె, దిశా పటాని, మృణాల్ ఠాకూర్, మాళవిక నైర్, శోభన లాంటి పాన్ ఇండియా మహిళా కాస్ట్ కనిపించగా ఉలగనయగన్ కమల్ హాసన్ ,అమితాబ్ బచ్చన్ అలాగే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి సీనియర్ టు యంగ్ హీరోస్ కూడా కనిపించారు.


Click it and Unblock the Notifications











