OTTలోకి రాబోతున్న రీసెంట్ సూపర్ హిట్ థ్రిల్లర్ సినిమా.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

ఈ మధ్య కాలంలో అనేక అద్భుతమైన సినిమాలు ఓటీటీ వేధికగా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఎవరూ ఊహించని స్థాయిలో నెల రోజులు కూడా కాకముందే ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. చిన్నా, పెద్దా చిత్రాలని ఏం లేకుండా త్వరగా డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతూ ఓటీటీ ప్రియులను తెగ అలరిస్తున్నాయి. ఇటీవలే సలార్ వంటి సూపర్ డూపర్.. పాన్ ఇండియా స్టార్ సినిమా కూడా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేంది. అలాగే మరో అద్భుతమైన హిట్ థ్రిల్లర్ మూవీ కూడా ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ సినిమా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

విజయ్ సేతుపతి, కత్రినా కైప్, రాధికా ఆప్టే వంటి స్టార్ నటీనటులు నటించిన తాజా సూపర్ హిట్ థ్రిల్లర్ సినిమా మేరీ క్రిస్మస్. టిప్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మ్యాచ్‌బాక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై రమేష్ తౌరాణి, జయ తౌరాణి, సంజయ్ రౌత్రే, కేవల్ గార్గ్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించాడు. విజయ్​ సేతుపతి, కత్రినా కైఫ్, రాధిక ఆప్టేలే కాకుండా ఈ సినిమాలో అదితి గోవిత్రికర్, సంజయ్ కపూర్, టిన్న ఆనంద్, వినయ్ పాఠక్, విజయ్ కుమార్ రాజేంద్రన్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.

Vijay Sethupathi Merry Christmas Movie OTT Streaming Date Fixed Check Details

అయితే జనవరి 12వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పటి వరకు డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ కు థ్రిల్లర్ జోనర్ కథలే మంచి గుర్తింపు తెచ్చిపెట్టగా... ఇప్పుడు మాత్రం ఈ సినిమా అంతగా హిట్టు కొట్టలేకపోయింది. కానీ కథ పరంగా ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. థియేటర్ల నుంచి త్వరగా బయటకు వచ్చేసిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి రాబోతుంది.

ఈ సినిమా విడుదల కాకముందే ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దాదాపు 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరక్కిన ఈ సినిమాను అదే ధరకు నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందట. అలాగే 30 రోజుల్లోపే కచ్చితంగా విడుదల చేస్తామని సినిమా రిలీజ్ కు ముందే అగ్రిమెంట్ కూడా చేసుకున్నారట. అలా ఈ సినిమా త్వరగా ఓటీటీలోకి రాబోతుంది. ఎక్కువ రోజులు థియేటర్లలో ఉంటే కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఈ సినిమా త్వరగానే బయటకు రావడంతో ఓటీటీలోకి వచ్చేస్తుంది.

Vijay Sethupathi Merry Christmas Movie OTT Streaming Date Fixed Check Details

అయితే ఫిబ్రవరి 9వ తేదీన విజయ్ సేతుపతి మేరీ క్రిస్మస్ సినిమా ఓటీటీ వేధికగా స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. ఒకవేళ ఆరోజు కాకపోతే మాత్రం ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన కచ్చితంగా విడుదల చేస్తారని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సూపర్ హిట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను.. ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే కూర్చొని చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X