మరింత ముందుగానే ఓటీటీలోకి మహారాజ.. 100 కోట్లు కొట్టిన దీన్ని ఎందులో చూడాలంటే!
ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది సూపర్ స్టార్లు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఒకరు. కోలీవుడ్‌కు చెందిన అతడు.. అన్ని భాషల్లోనూ నటిస్తూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'మహారాజ' అనే సినిమాను చేశాడు.
కోలీవుడ్ బడా స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన యాక్షన్ అండ్ డ్రామా మూవీనే 'మహారాజ'. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చింది. దీంతో ఈ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని జూన్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు.

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటించిన 'మహారాజ' మూవీ ఎన్నో అంచనాలతో వచ్చింది. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ భారీగానే లభించింది. ఫలితంగా విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రం రెండు వారాల్లోనే రూ. 100 కోట్లు మార్కును చేరుకుంది. తద్వారా హిట్ స్టేటస్‌ను అందుకోవడంతో పాటు భారీ లాభాలను అందుకుంది.
సూపర్ స్టార్ విజయ్ సేతుపతి నటించిన 'మహారాజ' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఫేమస్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సదరు సంస్థ నెల రోజుల తర్వాతనే స్ట్రీమింగ్ చేస్తుందని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని జూలై 19వ తేదీన స్ట్రీమింగ్ చేయబోతున్నారని జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది.

క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన 'మహారాజ' సినిమా స్ట్రీమింగ్‌పై చర్చలు జరుగుతోన్న నేపథ్యంలో తాజాగా దీనిపై ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం ఈ చిత్రాన్ని ఒక వారం ముందుగానే అంటే జూలై 12వ తేదీనే నెట్‌ఫ్లిక్స్ సంస్థ అందుబాటులోకి తీసుకు రాబోతుందట. దీనిపై ఈ వారంలోనే అధికారిక ప్రకటన రాబోతుందని మరో వార్త కూడా వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. విజయ్ సేతుపతి - నిథిలన్ స్వామినాథన్ కాంబోలో రూపొందిన ఈ చిత్రాన్ని జగదీష్ పలణిస్వామి, సుదన్ సుందరమ్ నిర్మించారు. ఈ సినిమాకు అంజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్‌ను అందించారు. ఇందులో అభిరామి, మమతా మోహన్‌దాస్, భారతిరాజా, దివ్య భారతి, మునిష్‌కాంత్ కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











