మహారాజ క్లైమాక్స్ కాపీ కొట్టారా? ఒరిజినల్ సినిమా ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

ఈ ఏడాదిలో ఆయా సినీ ఇండస్ట్రీస్ తాలూకా పెర్ఫామెన్స్ లు బాగున్నాయి అంటే బాగున్నాయి అని చెప్పాలి లేదు అంటే లేదనే అనుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్క ఏడాదిలో గతంలో కరోనా సమయంలో చూసిన ఇబ్బందులు ఆ తర్వాత వచ్చిన భారీ హిట్ లు కూడా ఈ ఒక్క ఏడాదిలోనే చూసేసాం. ముఖ్యంగా తమిళ సినిమా అయితే ఓ సరైన హిట్, రిలీజ్ లు లేక హీరో విజయ్ సినిమాలు రీ రిలీజ్ చేసుకున్నారు.

కానీ ఈ మొత్తం 5 నెలల ఇబ్బందుల తర్వాత వచ్చాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన "మహారాజ" సినిమాతో. ఓపెన్ గా చెప్పుకోవాలి అంటే విజయ్ సేతుపతికి విలన్ గా చేసిన పాత్రలు మినహా తాను స్ట్రైట్ గా చేసిన సినిమాలతో గడిచిన కొన్నేళ్లలో సరైన మార్కెట్ లేదు. కానీ విజయ్ సేతుపతి మాత్రం తన కెరీర్ లో 50 వ సినిమాగా మాత్రం ఒక గుర్తుండిపోయే హిట్ ని కొట్టేసాడు.

Vijay sethupati s maharaja climax copied from this movie which is streaming in this ott platform

కొత్త దర్శకుడు నిథిలన్ సామి తో చేసిన ఈ సినిమా గత వారమే థియేటర్స్ లోకి వచ్చింది. రావడం సాలిడ్ పాజిటివ్ మౌత్ టాక్ సొంతం చేసుకొని చాలా నెలల తర్వాత భారీ బుకింగ్స్ తో అదరగొట్టింది. అయితే ఈ సినిమాలో మెప్పించే థ్రిల్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లు ఎమోషన్స్ ఉన్నాయి. అలాగే క్లైమాక్స్ కూడా చాలామందిని ఎంతగానో కదిలించింది.

ఇంకా చెప్పాలంటే మన తెలుగులో ఈ సినిమాకి ప్రమోషన్స్ "ముగింపు ఎవరికీ చెప్పొద్దు" అంటూ ప్రమోట్ చేశారు. అయితే ఇవేవి తెలియని వారు తప్పకుండా ఇంప్రెస్ అవుతారు. కానీ.. ఈ సినిమా క్లైమాక్స్ తరహాలోనే ఆల్రెడీ మరో సినిమాలో కూడా ఉంది. కాకపోతే ఈ సినిమా క్లైమాక్స్ కోసం సోషల్ మీడియాలో చాలా ఎక్కువే మాట్లాడుతున్నారు. అది కూడా ఈ సినిమా ఎప్పుడో ఎక్కడో వచ్చింది కూడా కాదు జస్ట్ గత ఏడాదిలోనే మన సౌత్ లోనే వచ్చింది.

ఇంతకీ ఈ సినిమా ఏ భాషలో వచ్చింది అంటే కంటెంట్ కి మరో పేరుగా పిలుచుకునే మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. తమిళ్ లో విజయ్ సేతుపతి ఎలా వెర్సటైల్ నటుడో మలయాళంలో కూడా జోజు జార్జ్ కి వెర్సటైల్ నటుడుగా పేరుంది. మరి తాను ప్రధాన పాత్రలో అంజలి జోడిగా దర్శకుడు దర్శకుడు ఎం జి కృష్ణన్ తెరకెక్కించిన "ఇరట్టా" అనే సినిమాలో కూడా మహారాజ తరహా క్లైమాక్స్ కనిపిస్తుంది.

Vijay sethupati s maharaja climax copied from this movie which is streaming in this ott platform

అయితే ఇక్కడ చిన్న తేడా మాత్రం ఉంటుంది. అది వివరించేందుకు ఎబ్బెట్టుగా ఉంటుంది కానీ మొదట ఆ సినిమా చూసి తర్వాత మహారాజ చూసినవారికి మాత్రం ఖచ్చితంగా కాపీ చేసారా అన్నట్టు అనిపిస్తుంది. మెయిన్ గా అయితే తండ్రి కూతురు మధ్య సన్నివేశం ఇంచుమించు ఒకేలా అనిపించక మానదు.

ఇక ఇంతకీ ఈ ఇరట్టా అనే సినిమాని ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు. ఇంకా ఈ సినిమా మలయాళంతో పాటుగా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మరి మీరు మహారాజ చూసినవారు అయితే ఓసారి అది ట్రై చేయవచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ మహారాజ సినిమా ఓటిటి హక్కులు కూడా నెట్ ఫ్లిక్స్ వారే సొంతం చేసుకున్నారు.

దీనితో ఒకేలాంటి క్లైమాక్స్ ఉన్న రెండు సినిమాలు ఒకే ఓటిటి వేదికని సొంతం చేసుకున్నాయి. అన్నట్టు జోజు జార్జ్ తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చారు. మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన 'ఆదికేశవ' లో విలన్ గా తాను కనిపించారు. కానీ సినిమా అనుకున్న రేంజ్ హిట్ కాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X