LEO Movie OTT: లియో ఓటీటీ వివరాలు లీక్.. అనుకున్న దానికంటే ముందే స్ట్రీమింగ్

పేరుకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. తనదైన చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు ఇళయదళపతి విజయ్. ఇలా సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తోన్న అతడు.. సినిమా సినిమాకూ తన రేంజ్‌ను కూడా పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ 'లియో' అనే సినిమాను చేశాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు తగ్గట్లుగానే ఇది తాజాగా విడుదలైంది.

కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ నటించిన సినిమానే 'లియో'. పూర్తి స్థాయిలో యాక్షన్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా ఈరోజే (అక్టోబర్ 19న) విడుదలైంది. దీనికి ఓవర్సీస్‌లోని ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చింది. ఇదే వరల్డ్ వైడ్‌గా కనిపిస్తోంది. ఫలితంగా ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి స్పందన మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో దీనికి మొదటి రోజే రూ. 100 కోట్లు గ్రాస్ వచ్చే ఛాన్స్ కూడా ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

Vijay Starrer LEO Movie Digital Partner and Streaming Date Details

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'లియో' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ గురించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. దీని ప్రకారం.. ఈ చిత్రం ఓటీటీ హక్కులను ఫేమస్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఇక, ఈ రైట్స్‌కు గానూ సదరు సంస్థ చిత్ర యూనిట్‌కు రికార్డు స్థాయి మొత్తాన్ని ముట్టజెప్పినట్లు కూడా కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. విజయ్ నటించిన 'లియో' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్ గురించి కూడా తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ చిత్రాన్ని థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. దీని ప్రకారం.. అక్టోబర్ 19న థియేటర్లలోకి వచ్చిన 'లియో' మూవీ.. నవంబర్ మూడో వారంలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందని తెలిసింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Vijay Starrer LEO Movie Digital Partner and Streaming Date Details

ఇక, విజయ్ - లోకేష్ కాంబినేషన్‌లో రూపొందిన 'లియో' చిత్రాన్ని లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి నిర్మించారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేసింది. అలాగే, సంజయ్ దత్ విలన్‌గా, అర్జున్ సర్జా కీలక పాత్రలో నటించారు. దీనికి అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X