Greatest of All Time: ఆ ఓటీటీలోనే విజయ్ ది గోట్ మూవీ.. ఎప్పుడు రాబోతుందో తెలిస్తే!

పేరుకు కోలీవుడ్‌కు చెందిన హీరోనే అయినా.. తనదైన సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఫాలోయింగ్‌ను అందుకున్నాడు ఇళయదళపతి విజయ్. ఇలా సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తోన్న అతడు.. తన రేంజ్‌ను కూడా పెంచుకుంటున్నాడు. దీనికితోడు విజయ్ ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు.

వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న విజయ్ నటించిన లేటెస్ట్ మూవీనే 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (The Greatest of All Time). వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని హై రేంజ్‌లో తీశారు. ఇలా దీన్ని అత్యంత గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

Vijay Starrer The Greatest of All Time Movie OTT Partner and Streaming Date Details

కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో విజయ్ నటించిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమాకు ఓవర్సీస్‌లోని ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చింది. ఇదే వరల్డ్ వైడ్‌గా కనిపిస్తోంది. ఫలితంగా ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి స్పందన మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో దీనికి మొదటి రోజే రూ. 100 కోట్లు గ్రాస్ వచ్చే ఛాన్స్ కూడా ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ గురించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. దీని ప్రకారం.. ఈ చిత్రం ఓటీటీ హక్కులను ఫేమస్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఇక, ఈ రైట్స్‌కు గానూ సదరు సంస్థ చిత్ర యూనిట్‌కు రికార్డు స్థాయి మొత్తాన్ని ముట్టజెప్పినట్లు కూడా కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Vijay Starrer The Greatest of All Time Movie OTT Partner and Streaming Date Details

విజయ్ నటించిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్ గురించి కూడా తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ చిత్రాన్ని థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. దీని ప్రకారం.. సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. అక్టోబర్ మూడో వారంలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందని తెలిసింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా.. విజయ్ - వెంకట్ ప్రభు కాంబోలో రూపొందిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అఘోరం, గణేష్, సురేష్‌లు నిర్మించారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేయగా.. ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్‌లు కీలక పాత్రలు చేశారు. యువన్ శంకర్ రాజా దీనికి మ్యూజిక్ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X