The GOAT: ది గోట్ మూవీ ఆ హాలీవుడ్ సినిమాకి కాపీనా? ఒరిజినల్ సినిమా ఏంటి? ఏ ఓటిటిలో చూడొచ్చంటే?
జెనరల్ గా సినిమాలో ఓ సినిమా నుంచి మరో సినిమాలో ప్రేరణ చెంది పలు సీన్స్ డిజైన్ చేయడం కానీ లేదా పాటలు, ట్యూన్స్ వంటివి కొనుకోవడం కానీ చాలానే జరుగుతూ ఉంటాయి. కానీ కొందరు మాత్రం పలు సినిమాల కాన్సెప్ట్ లు కూడా లేపేస్తుంటారు. అలా ఇప్పుడు ఉన్న రోజుల్లో ఓ స్టార్ హీరోతో భారీ సినిమా సినిమా చేయాలి అంటే అది కత్తి మీద సాము లాంటిదే అని చెప్పాలి.
ఓటిటిలు చాలా సినిమాలు రీచ్ కూడా మారిపోవడంతో ఏవైనా కాపీ కొట్టినా కూడా వెంటనే తెలిసిపోతుంది. ఇంతకు మునుపు కొంచెం సమయం పట్టేది కానీ ఈసారి మాత్రం ఇలా లేవు పరిస్థితులు. సో ఓ కొత్త సినిమాలో ఒక్క సీన్ అలా ఉన్నా దానికి కాపీ మరకలతో ట్రోల్స్ గట్టిగా పడుతున్నాయి. కాగా ఇలా లేటెస్ట్ గా ఆడియెన్స్ ని మోసం చేసిన సినిమా ఏది అంటే తాజాగా తమిళ్ లో వచ్చిన భారీ సినిమా "ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం" అని చెప్పాలి.

విజయ్ దళపతి నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించాడు. కాగా వెంకట్ ప్రభు సినిమాలకి తమిళ నాట మంచి క్రేజ్ ఉంది. వినూత్న సినిమాలు తాను చేస్తాడు అనే ఒక మార్క్ ఉంది కానీ ఈ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం కి మాత్రం తాను దొరికేసాడు. కాగా ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ చూసినప్పుడే చాలా మందికి ఇదేదో హాలీవుడ్ సినిమాకి కాపీలా ఉందే అని అనుకున్నారు.
కానీ అప్పుడు వెంకట్ ప్రభు ఆ కామెంట్స్ ని తోసిపుచ్చాడు. సరే కాదులే అని అనుకున్నవారికి థియేటర్స్ లో మాత్రం అదే సినిమాని దింపేసి షాకిచ్చాడు అని చెప్పాలి. ఇంతకీ ఈ సినిమాని వెంకట్ ప్రభు ఏ హాలీవుడ్ సినిమా నుంచి లేపేశాడో తెలుసా? హాలీవుడ్ లో స్టార్ హీరో అయినటువంటి విల్ స్మిత్ హీరోగా నటించిన "జెమినీ మ్యాన్" అనే సినిమా నుంచి విజయ్ సినిమా "ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం" కాన్సెప్ట్ మొత్తం కాపీ కొట్టి తెరకెక్కించబడింది.

ఆ చిత్రంలో కూడా క్లోనింగ్ టెక్నాలజీ తోనే విల్ స్మిత్ లాంటి మరో యువకుడిని అతని శక్తి సామర్ధ్యాలతో తయారు చేస్తారు. సేమ్ ఇక్కడ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం లో కూడా ఇదే కనిపిస్తుంది. అలాగే అక్కడ తన క్లోన్ విలన్ గానే కనిపిస్తుంది. ఇంకా జెమినీ మ్యాన్ లో ఇంట్రో సీన్ ని కూడా గోట్ లో కాపీ కొట్టేసినట్టుగా అనిపిస్తుంది. ఎక్కడో దూరం నుంచి ఉన్న స్నైపర్ రన్నింగ్ ట్రైన్ ని టార్గెట్ చేయడం వంటివి కనిపిస్తాయి.
అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ సీన్ కొంచెం మార్చి గోట్ లో పెట్టేసేసారు. ఇలా మొత్తంగా అయితే ఆ హాలీవుడ్ సినిమా నుంచి ఈ సినిమాకి కాన్సెప్ట్ ని కొన్ని సీన్స్ ని లేపేసారని చెప్పాలి. మరి ఆ ఒరిజినల్ జెమినీ మ్యాన్ ని ఏ ఓటిటిలో చూడొచ్చంటే.. పాపులర్ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. పైగా ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులోకి ఉంది. ఒకసారి ఈ సినిమా చూస్తే మాత్రం విజయ్ సినిమాపై ఖచ్చితంగా మీ ఒపీనియన్ మారిపోవచ్చు..


Click it and Unblock the Notifications











