GOAT Run Time OTT: ఓటిటిలో షాకింగ్ రన్ టైంతో ది గోట్.. విజయ్ సినిమా నిడివి ఎంతో తెలుసా?
ఇటీవల సౌత్ ఇండియా సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన టాప్ హీరో సినిమా ఏదన్నా ఉంది అంటే అది విజయ్ దళపతి హీరోగా నటించిన "ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం" అనే చెప్పాలి. కాగా విజయ్ నుంచి గత చిత్రం 600 కోట్లకి పైగా గ్రాసర్ తర్వాత వచ్చిన సినిమా ఇది కావడంతో మొదట్లో దీనిపై కూడా భారీ హైప్ నెలకొంది. కానీ రిలీజ్ కి వచ్చే సరికి మాత్రం అనుకున్న రేంజ్ లో హైప్ ని అందుకోలేదు.
పైగా టాక్ కూడా బాగా రాలేదు. దీనితో ఇండియాలో సౌత్ మార్కెట్ లో దెబ్బ పడింది. ఇక ఈ చిత్రానికి తెలుగులో కూడా విజయ్ కెరీర్ లో ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల కంటే తక్కువ ఓపెనింగ్స్ అందుకొని డిజాస్టర్ దిశగా వెళుతుంది. అయితే సినిమా రిలీజ్ అయ్యాక దర్శకుడు అండ్ టీం నుంచి పలు ఆసక్తికర విషయాలు బయటకి వస్తున్నాయి.

ఇలా ఈ సినిమా ఓటిటి రిలీజ్ సంబంధించి రిలీజ్ డే నుంచే పలు వార్తలు వైరల్ కాగా ఈ సినిమా అక్టోబర్ మొదటి వారానికే ఓటిటిలో ఉంటుంది అని వినిపించింది. ఇక దీనితో పాటుగా ఈ సినిమా ఓటిటి వెర్షన్ పై కూడా షాకింగ్ అప్డేట్ ఒకటి వైరల్ గా మారింది. మేకర్స్ ఈ చిత్రాన్ని ఓటిటిలో మాత్రం భారీ రన్ టైం తో వదలబోతున్నారట. ఇది డైరెక్టర్ కట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో పలు చిత్రాలకి కూడా డైరెక్టర్ కట్ ఓటిటి వెర్షన్ అంటూ వచ్చాయి కానీ వాటిలో ఒకటి కూడా ఓటిటిలో నిడివితో రాలేదు. గత ఏడాది వచ్చిన ఆనిమల్ సినిమా ఒక్కటి ఒరిజినల్ రన్ టైం 3 గంటల 20 నిమిషాలు దాటి ఉంటే అది ఇంకో రెండు మూడు నిమిషాలు మాత్రం పెంచి వదిలినట్టు ఉన్నారు. కానీ ఇక్కడ విజయ్ ది గోట్ సినిమా థియేట్రికల్ గానే 3 గంటల 3 నిమిషాల మేర వస్తే ఓటిటిలో మాత్రం ఊహించని రన్ టైం 3 గంటల 40 నిమిషాల నిడివితో రాబోతుందట.

ఇది దర్శకుడు వెంకట్ ప్రభు కట్ గా రాబోతుంది అని సర్ప్రైజ్ లు ఉన్నాయని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి వెంకట్ ప్రభు ఓటిటి వెర్షన్ కోసం ఏం దాచి ఉంచాడో చూడాలి. దీనితో పాటుగా సినిమాకి సెకండాఫ్ ని తాము మరో వెర్షన్ లో కూడా రెడీ చేశామని కానీ థియేట్రికల్ గా ఇది రిలీజ్ చేశామని చెప్పారు. ఇలా మొత్తానికి విజయ్ సినిమాని ఏదేదో చేసి రిలీజ్ చేసారని చెప్పాలి.
అన్నట్టు ఈ సినిమాని వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేశారు. కాగా ఈ చిత్రంలో హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి, సీనియర్ నటి స్నేహ కూడా హీరోయిన్స్ గా విజయ్ సరసన నటించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. అలాగే ఏజిఎస్ బ్యానర్ పై కల్పాత్తి ఫ్యామిలీ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం వహించారు.


Click it and Unblock the Notifications











