Varasudu OTT: వారసుడు ఓటీటీ డేట్ ఫిక్స్.. నెల కూడా కాకముందే స్ట్రీమింగ్
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. తనదైన నటన, స్టైల్స్‌తో దక్షిణాది మొత్తంలో ప్రభావాన్ని చూపించే స్థాయికి ఎదిగాడు ఇళయదళపతి విజయ్. పక్కా కమర్షియల్ చిత్రాలు చేస్తూ సినీ ప్రియులతో పాటు అభిమానులను అలరిస్తోన్న అతడు.. క్రమంగా తన రేంజ్‌ను పెంచుకుంటూ దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ కోలీవుడ్ స్టార్ హీో 'వారసుడు' (తమిళంలో వారిసు) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీ ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది.
తెలుగు, తమిళంలో రూపొందిన 'వారసుడు' మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల అవుతుందని చిత్ర యూనిట్ ఎప్పుడో అనౌన్స్ చేసింది. కానీ, మన ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు ఉండడంతో దీన్ని జనవరి 14న విడుదల చేశారు. తమిళంలో మాదిరిగానే ఇక్కడ కూడా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. ఇలా ఇప్పటి వరకూ ఈ చిత్రం రూ. 200 కోట్లుకు పైగా గ్రాస్‌ను వసూలు చేసి హవాను చూపిస్తోంది. తెలుగులోనూ ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరేందుకు అడుగు దూరంలోనే ఉంది.

పూర్తి స్థాయి కుటుంబ కథతో రూపొందిన 'వారుసుడు' హక్కుల కోసం పోటీ తీవ్ర స్థాయిలో ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఈ మూవీ డిజిటిల్ రైట్స్ కోసం చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ విజయ్ సినిమా ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని టైటిల్ కార్డ్సులో క్లారిటీ ఇచ్చారు. ఇక, ఈ సినిమాను అన్ని భాషల్లో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంటే.. ఇది విడుదలైన నెల రోజుల లోపే డిజిటల్ స్ట్రీమింగ్ జరుపుకోబోతుందన్న మాట.
ఇళయదళపతి విజయ్ నటించిన 'వారసుడు' మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కించాడు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇందులో శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కుస్భూ, జయసుధ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించాడు.


Click it and Unblock the Notifications











