Rana Naidu సిరీస్‌పై విజయశాంతి సంచలన పోస్ట్.. ఇద్దరు హీరోల ముందు ఊహించని డిమాండ్
గతంలో కంటే ఇప్పుడు చాలా మంది టికెట్ కొనుక్కుని సినిమా చూసే అలవాటును మార్చుకుంటున్నారు. దీనికి కారణం మార్కెట్‌లో బోలెడు ఓవర్ ద టాప్ (ఓటీటీ) ఫ్లాట్‌ఫామ్స్ ఉండడమే. వీటి ద్వారా ఇంట్లో కూర్చునే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు సహా బోలెడు వీడియోలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన వెబ్ సిరీసే 'రానా నాయుడు'. అడల్ట్ కంటెంట్‌తో వచ్చిన ఈ సిరీస్‌పై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై సీనియర్ నటి విజయశాంతి విమర్శలు చేశారు. ఆ వివరాలు మీకోసం!

రానా నాయుడుగా వచ్చారు
విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా కలిసి నటించిన వెబ్ సిరీసే 'రానా నాయుడు'. సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వం వచ్చిన దీన్ని సుందర్ అరోన్ సుమిత్ శుక్లా నిర్మించారు. దీనికి జాన్ స్టీవర్ట్ ఎదురురి సంగీతాన్ని అందించారు. ఇందులో సుర్వీన్ చావ్లా, అభిషేక్ బెనర్జీ, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

బూతులు.. హాట్ సీన్స్ వల్ల
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్ పది ఎపిసోడ్లతో వచ్చేసింది. ఇందులో ఊహించిన విధంగా ఎన్నో బూతులు ఉన్నాయి. అలాగే, కొన్ని శృంగారభరిత హాట్ సీన్స్ కూడా కనిపించాయి. ముఖ్యంగా ఫ్యామిలీ హీరోగా పేరొందిన వెంకటేష్ నుంచి కూడా డబుల్ మీనింగ్ డైలాగులు వినిపించాయి. దీంతో ఇది చూసిన వాళ్లంతా షాక్‌కు గురవుతున్నారు.

నెటిజన్లు, ప్రముఖులు ఫైర్
ఎన్నో అంచనాల నడుమ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్‌లో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని చాలా మంది దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో ఈ సిరీస్‌ను తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే, ప్రముఖులు సైతం ఈ వెబ్ సిరీస్ తీసిన తీరుపై విమర్శలు చేస్తూ.. వెంకీ, రానాను కూడా తప్పుబడుతోన్నారు.

విజయశాంతి పరోక్షంగానే
ఇప్పటికే 'రానా నాయుడు' వెబ్ సిరీస్‌పై ఎంతో మంది సినీ ప్రముఖులు సైతం పెదవి విరుస్తూ విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, రాజకీయ నాయకురాలు విజయశాంతి ఈ సిరీస్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అంతేకాదు, 'ఓటీటీలో వచ్చే కంటెంట్‌కు కూడా సెన్సార్ ఉండాలి' అంటూ తన వాదనను వినిపించారు.

మహిళలు సమస్య అంటూ
తాజాగా తన ఫేస్‌బుక్ ఖాతాలో విజయశాంతి 'ఈ మధ్యనే విడుదలైన ఒక తెలుగు (బహుబాషా) ఓటీటీ సిరీస్‌పై It needs Strict Censoring for ott platform అనే విషయమై ఎంతో మంది ప్రజలు.. ప్రత్యేకించి మహిళలు ఈ సమస్యను ముందుకు తెస్తున్నారు. ప్రజల మనోభావానుసారం నేను చెప్తున్న అంశం అర్థం చేసుకోవాలి' అంటూ చెప్పుకొచ్చారు.

ఆ సిరీస్‌ను తొలగించాలని
ఇదే పోస్టులో విజయశాంతి 'తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల దాకా తెచ్చుకోకుండా.. ప్రజలంతా నిరసన చేస్తున్న సిరీస్‌కు సంబంధించిన ప్రసారాలను.. సదరు ఓటీటీ నుంచి తొలగించాలని.. ఇందులో నటించిన సంబంధిత నటులు, నిర్మాతలను డిమాండ్ చేస్తున్నాను. భవిష్యత్‌లో కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని చెప్తున్నాను' అని అన్నారు.
గౌరవం నిలబెట్టుకోవాలి
విజయశాంతి కంటిన్యూ చేస్తూ.. 'భవిష్యత్‌లోనూ ఓటీటీ ప్రసారాలలో ఎక్కడైనా ప్రజల నుంచి ముఖ్యంగా మహిళా వ్యతిరేకతకు గురయ్యేవి లేని పద్దతులను పాటించాలని కోరుకుంటున్నా. అలాగే, సదరు నటీనటులు తమకు ప్రజలు ఇచ్చిన అభిమానాన్ని, మరింత గౌరవంతో నిలబెట్టుకుంటారని అభిప్రాయపడుతున్నాను.. విజయశాంతి' అంటూ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











