Unstoppable: అన్‌స్టాపబుల్ షో విజయశాంతి ఘాటైన వ్యాఖ్యలు.. బాలయ్యకు చంద్రబాబు బావ కాబట్టే అంటూ..
ఓటీటీ మార్కెట్ రోజు రోజుకు పెరుగుతున్న దశలో భవిష్యత్తులో ఈ సెక్టార్ మరింత పాపులర్ అవుతుందనే అంచనాతో ఆహా ఓటీటీని ప్రారంభించారు స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. నత్తనడకన సాగుతున్న ఆహాకు ఊపుతెచ్చిన కార్యక్రమం అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రసారమైన ఈ టాక్‌తో రికార్డు వ్యూయర్‌షిప్‌తో పాటు ఆహాకు సబ్‌స్క్రైబర్లను పెంచింది.
నటసింహం నందమూరి బాలకృష్ణలోని మరో కోణాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించింది అన్‌స్టాపబుల్. తన అల్లరి, ఇంటర్వ్యూ చేసే విధానంతో బాలయ్య కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ షో తర్వాత ఆయనకు పిల్లలు, మహిళా ప్రేక్షకుల్లోనూ ఫాలోయింగ్ పెరిగింది. అంతేకాదు ఈ అల్టిమేట్ టాక్ షో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఐఎండీబీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 18వ స్థానంలో, రీజినల్ లాంగ్వేజ్ కేటగిరీలో నెంబర్ వన్‌గా నిలిచింది అన్‌స్టాపబుల్. ఇప్పటికీ నాలుగు సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ మెగా షో త్వరలో ఐదో సీజన్‌తో రానుంది.

హోస్ట్‌గా నందమూరి బాలకృష్ణను తీసుకురావాలన్న అల్లు అరవింద్ ప్లాన్ అన్ని రకాలుగా వర్కవుట్ అయింది. ఈ షోకు పవన్ కళ్యాణ్ , మహేశ్ బాబు, ప్రభాస్, రవితేజ, అల్లు అర్జున్, నాని , శర్వానంద్, గోపీచంద్ సహా పలువురు హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలే కాకుండా రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వంటి టాప్ పొలిటిషీయన్లు అన్‌స్టాపబుల్ షోకు హాజరై తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు.
ఎప్పుడూ సీరియస్‌గా ఉండే సీఎం చంద్రబాబు నాయుడులోని మరో కోణాన్ని బయటపెట్టారు బాలయ్య. షోలో చంద్రబాబుతో ఆటలు ఆడించి ఆయనను కాలేజ్ రోజుల్లోకి తీసుకెళ్లారు బాలకృష్ణ. అలాగే చంద్రబాబు చేతిలో 500 రూపాయలు పెట్టి ఆయనతో షాపింగ్ చేయించి నవ్వులు పూయించారు బాలయ్య. కాలేజ్ రోజుల్లో బైక్‌పై యూనివర్సిటీ చుట్టూ చక్కర్లు కొట్టేవాడినని, చాలా అల్లరి చేసేవాడినని చంద్రబాబుతో చెప్పించారు బాలకృష్ణ. భువనేశ్వరి, బ్రాహ్మాణి ఫోటోలు పక్కపక్కనపెట్టి మీకు వీరిద్దరిలో బాస్ ఎవరంటూ టఫ్ క్వశ్చర్ అడిగారు.
అయితే అలాంటి షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ హీరోయిన్ విజయశాంతి. జయసుధ, జయప్రద, సుహాసిని వంటి సీనియర్ హీరోయిన్లను అన్‌స్టాపబుల్ షోకు తీసుకొచ్చిన బాలయ్య.. తనకు హిట్ పెయిర్‌గా నిలిచిన విజయశాంతిని ఇంటర్వ్యూకు తీసుకొస్తారని అభిమానులు అనుకున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయశాంతిని.. మీరు అన్‌స్టాపబుల్ షోకు హాజరవుతారా అని యాంకర్ అడుగుతుంది. ఇప్పటికే చాలా మంది హీరోలు అలాంటి టాక్ షోలను ప్రారంభించారని, తనకు అలాంటి షోకు వెళ్లడంపై ఆసక్తి లేదని విజయశాంతి తెలిపింది. అయితే చంద్రబాబు నాయుడు లాంటి పొలిటీషియన్ కూడా హాజరయ్యారని , మీరు కూడా రాజకీయ నాయకురాలు కాబట్టి వెళ్తారా అని యాంకర్ మళ్లీ అడుగుతుంది. అయితే చంద్రబాబు అంటే బాలయ్యకి చుట్టం కాబట్టి ఆహ్వానాలు వెళ్తాయని రాములమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విజయశాంతి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











