4 ఏళ్ల తర్వాత OTTలోకి వచ్చిన అదిరియే థ్రిల్లర్ మూవీ.. తెలుగులో కావాలంటే అలా చూసేయండి!
ఓటీటీల హవా పెరుగుతున్నా కొద్ది పాత సినిమాలను కూడా ఓటీటీలోకి తీసుకు వస్తూ తెగ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీ ప్రియులు సినిమా బాగుందని తెలిస్తే చాలు.. ఏ భాషలో వచ్చినా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూసేస్తున్నారు. ఆ విషయం అర్థం చేసుకున్న దర్శక, నిర్మాతల పాత చిత్రాలను అందుబాటులోకి తేవడంతో పాటు అన్ని భాషల్లోనూ డబ్ చేసి మరీ ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఇలా రాబోతున్నదే ఓ క్రేజీ యాక్షన్ థ్రిల్లర్.
గత నాలుగు సంవత్సరాల క్రితం వచ్చి క్రేజీ యాక్షన్ మూవీ.. అసురగురు. విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లోనే నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అయింది. ఇప్పటికీ అందుబాటులో ఉంది. కానీ తాజాగా ఈ సినిమా తెలుగు వర్షన్ కూడా వచ్చేసింది. అయితే అసురు గురు తెలుగు వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో కాకుండా వేరే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

విక్రమ్ ప్రభు హీరోగా చేసిన అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్ చిత్రమే అసురగురు. 2020 సంవత్సరంలో మార్చి 13వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిందీ చిత్రం. A.రాజ్‌ధీప్ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని JSB ఫిల్మ్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు, మహిమా నంబియార్ ప్రధాన పాత్రలు పోషించగా.. సుబ్బరాజు, యోగి బాబు, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అదిరిపోయే కథాంశంతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించింది.
నాలుగేళ్ల క్రితమే విడుదల అయిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే కేవలం తమిళ భాషలో మాత్రమే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండగా.. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులోకి కూడా డబ్ చేశారు. కేవలం డబ్ చేయడం మాత్రమే కాకుండా.. ఆ సినిమాను ఓటీటీలోకి కూడా తీసుకు వచ్చారు. అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా వేదికగా ఈ సినిమా ప్రస్తుతం తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంత కాలం తర్వాత తెలుగులో అందుబాటులోకి వచ్చిన ఆ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని చూసేందుకు అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ క్రేజీ మూవీని చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











