OTT: ఓటిటిలోకి విక్రమ్ వెర్షన్ రంగస్థలం.. ఎప్పుడు ఎక్కడంటే..!

మారుతున్న ట్రెండ్ లో భాగంగా ఆడియెన్స్ ని అలరించేందుకు కొందరు దర్శక హీరోలు ఇపుడు చాలా కష్టపడుతున్నారు. తీస్తే హై ఎండ్ గ్రాఫిక్స్ లాంటి సినిమాలు లేదా అత్యంత సహజంగా సాగే కొన్ని విలేజ్ డ్రామాలు లాంటి చేస్తున్నారు. కాగా ఇలా వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దాదాపు మంచి రా అండ్ రస్టిక్ గా కనిపించే సినిమాలు హిట్ అవుతున్నాయి.

మరి ఇలాంటి సినిమాలో కొన్ని కొన్ని ట్రెండ్ సెట్టింగ్ గా నిలుస్తాయి. వాటి తర్వాత ఆ తరహాలోనే మరికొన్ని సినిమాలని మేకర్స్ తీయడం స్టార్ట్ చేస్తారు. మరి అప్పట్లో మగధీర తో మంచి స్టాండర్డ్స్ సెట్ చేసిన రామ్ చరణ్ మూలాన నెక్స్ట్ అదే తరహాలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ రంగస్థలం తో రామ్ చరణ్ మళ్ళీ కొత్త స్టాండర్డ్స్ సెట్ చేసేసరికి దాని నుంచి ఇంకొన్ని పుట్టుకొచ్చాయి.

vikram veera dheera soora part 2 ott date locked here you can watch

మరి ఇలా తమిళ్ లో కూడా అదే తరహాలో వచ్చిన లేటెస్ట్ సినిమానే "వీర ధీర శూర పార్ట్ 2". నటన కోసం ప్రాణం పెట్టేసే నటుడు చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ఈ చిత్రంని తెలుగులో విక్రమ్ వెర్షన్ రంగస్థలం అంటూ ప్రమోట్ కూడా చేశారు. కాగా ఆ సినిమా తరహాలోనే దీనిని కూడా చిన్నా సినిమా ఫేమ్ దర్శకుడు ఎస్ యూ అరుణ్ కుమార్ తెరకెక్కించగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది.

కాగా ఈ చిత్రం ఇప్పుడు ఓటిటికి వచ్చేందుకు సిద్ధం అయ్యింది. గత మార్చ్ 27న థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఇపుడు నెల తిరగకుండానే పాన్ ఇండియా భాషల్లో ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. కాగా ఈ చిత్రం తాలూకా అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ని తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఇచ్చేసారు.

కాగా ఈ సినిమాని ఈ రానున్న ఏప్రిల్ 24 నుంచే తమిళ్, తెలుగు, హిందీ సహా కన్నడ మరియు మలయాళ భాషల్లో తీసుకొస్తున్నట్టుగా రివీల్ చేసేసారు. దీనితో వీర ధీర శూర ఆరోజు నుంచి ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేయనుంది అని చెప్పవచ్చు. కాగా ఈ చిత్రంలో విలక్షణ నటులు ఎస్ జే సూర్య, 30 ఇయర్స్ పృథ్వీ అలాగే మలయాళ నటుడు సూరజ్ వాసుదేవన్ లు అద్భుతమైన పెర్ఫామెన్స్ లు ఈ సినిమాలో అందించారు.

అలాగే ధనుష్ రాయన్ సినిమాలో నటించిన దుషరా విజయన్ తదితరులు నటించారు. ఇక ఇవి పక్కన పెడితే విక్రమ్ ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు చేతిలో పట్టుకున్నాడు కానీ వాటిలో దర్శకుడు గౌతమ్ మీనన్ తో ప్లాన్ చేసిన దృవ నక్షత్రం మాత్రం ఇప్పటికీ విడుదలకి నోచుకోలేదు. ఈ సినిమా కోసం ఎప్పుడు నుంచో తమ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ వీర ధీర శూర పార్ట్ 2 గా ముందు రిలీజ్ చేశారు కానీ దీనికి ప్రీక్వెల్ ని కూడా తెరకెక్కించనున్నారు.

More from Filmibeat

Read more about: vikram Veera Dheera Soora
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X