OTTలోకి వచ్చేసిన సెన్సేషనల్ మూవీ... జీవితంలో ఎదగాలంటే ఈ సినిమా డోంట్ మిస్!
12th ఫెయిల్.. సినీ లవర్స్ అందరికీ దాదాపుగా ఈ సినిమా గురించి తెలిసే ఉంటుంది. చిన్న బడ్జెట్ మూవీగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. సామాన్యులే కాదు ఏకంగా సెలబ్రిటీలు కూడా సినిమాపై భారీ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడీ చిత్రం తెలుగు వెర్షన్ సడెన్‌గా ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. ఎక్కడ, ఎప్పుడు నుంచి స్ట్రీమింగ్ అవుతుందో స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం.
12th ఫెయిల్... :ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం కొన్ని వందల సినిమాలు విడుదల అవుతుంటాయి. యాక్షన్, క్రైమ్, కామెడీ, హారర్, మైథలాజికల్, పీరియాడికల్, బయోగ్రాఫికల్ ఇలా పలు రకాల జానర్స్‌లో వస్తుంటాయి. వీటన్నింటికీ అంతిమంగా లక్ష్యం ప్రేక్షకుడిని మెప్పించడమే. కల్పిత కథలను స్క్రీన్‌పై ఆవిష్కరించినప్పుడు లాజిక్‌లతో పని ఉండదు. మ్యాజిక్ చేసి చూపిస్తే చాలు. కానీ, బయోగ్రాఫికల్ అలా కాదు. ఇందులో సొసైటీపై ప్రభావం చూపే వ్యక్తుల స్ఫూర్తిదాయక జీవితమే.. కథా వస్తువు. ఇలాంటి వాటిని భావితరాలకు స్ఫూర్తి పంచేలా తీయాలి. అలాంటి ఓ కథే ఈ 12th ఫెయిల్.

ఓ సామాన్యుడు ఐపీఎస్ అధికారి:అయితే ప్రతి ఒక్కరూ తమ లైఫ్‌లో తప్పకుండా చూడాల్సిన కొన్ని చిత్రాలు ఉంటాయి. అలాంటి వాటి కిందకే ఈ 12th ఫెయిల్ వస్తుంది. ఎందుకంటే మనిషి వికాసానికి చదువు ఎంతో ముఖ్యం. దాని ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. అలాగే మారుమూల ప్రాంతంలోని ఓ పేద కుటుంబం నుంచి వచ్చి, ఓ దశలో 12వ తరగతిలో ఫెయిల్ అయినా, అన్ని కష్టాలను దాటుకొని ఓ సామాన్యుడు ఐపీఎస్ అధికారి ఎలా అయ్యాడని సినిమాలో అద్భుతంగా చూపించారు.
సెలబ్రెటీలు ప్రశంసలు... :గతేడాది ఏ మాత్రం అంచనాలు లేకుండా అతి తక్కువ లో బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద క్రమక్రమంగా హైప్ పెంచుతూ సూపర్ డూపర్ హిట్ అయింది. మనోజ్ కుమార్ శర్మ అనే ఐపీఎస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా దీన్ని రూపొందించారు. విధు వినోద్ చోప్రా దర్శకుడు. విక్రాంత్ మస్సే ప్రధాన పాత్ర పోషించారు. సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. విక్రాంత్ మస్సే నటనను తెగ మెచ్చుకున్నారు. చాలా మందికి ఈ చిత్రం ఎమోషనల్‌గా కనెక్ట్ అయింది. అందరూ కంటతడి పెట్టుకున్నారు.

మిస్ అయితే చూసేయండి...:అయితే ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్‍స్టార్ దక్కించుకుంది. గతేడాది డిసెంబర్ 29న కేవలం హిందీ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు తాజాాగా తెలుగు వెర్షన్ కూడా వచ్చింది. మరి ప్రశంసలతో పాటు పురస్కారాలు అందుకున్నఈ 12th ఫెయిల్ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయ్యారా? అయితే ఓటీటీలో చూసేయండి..


Click it and Unblock the Notifications











