OTT: సెన్సేషనల్ రికార్డ్... ప్రపంచంలోనే ఏకైక ఇండియన్ సినిమాగా ఘనత... ఎక్కడ చూడాలంటే?
బాలీవుడ్ లో చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం '12th ఫెయిల్'. ఇక ఈ సినిమా అక్టోబరు 27న హిందీలో రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు రాబట్టింది. ఇక తెలుగులో నవంబరు 3న రిలీజ్ అయి పర్వాలేదనిపించింది. ఇక ఈ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా అరుదైన రికార్డు సాధించింది. గ్లోబల్ వైడ్ 250 చిత్రాల్లో ఏకైక ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేయండి.
సినిమా బాగుంటే ప్రేక్షకులు పట్టం కడతారనే విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ లో చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు '12th ఫెయిల్' వచ్చింది. విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్ మస్సే ప్రధానపాత్రలో ఈ మూవీ తెరకెక్కింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకొని రికార్డులు సృష్టించింది. హిందీలో అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

20 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.70కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హిందీలో సక్సెస్ కావడంతో పలు భాషల్లో రిలీజ్ చేశారు మేకర్స్. ఇక తెలుగులో నవంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తెలుగులోనూ పర్వాలేదనిపించుకుంది. ఇక ఇటీవల ఈ సినిమా ఓటీటీలో కూడా సందడి చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.
అయితే ఈ సినిమా కేవలం హిందీ భాషలోనే స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా రిలీజ్ చేయాలని తెలుగు ప్రేక్షకులు డిమాండ్ చేసినప్పటికీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఇప్పుడు మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎమ్‌డీబీ) తాజాగా ప్రపంచవ్యాప్తంగా టాప్ 250 ఉత్తమ చిత్రాల లిస్టును రిలీజ్ చేసింది. ఇందులో 50వ స్థానంలో 12th ఫెయిల్ సినిమా నిలిచింది.

అంతేకాదు.. టాప్ 50లో ఉన్న ఏకైక ఇండియన్ సినిమాగా 12th ఫెయిల్ సినిమా నిలిచింది. దీనిపై దర్శకుడు వినోద్ కూడా రియాక్ట్ అయ్యారు కూడా. ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా చనిపోయినా ఫర్వాలేదనిపిస్తోందంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఐఎమ్‌డీబీలో అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ సినిమాగా ఈ చిత్రం గతంలోనే రికార్డు నెలకొల్పింది. హాలీవుడ్ చిత్రాలను వెనక్కినెట్టి 9.2 రేటింగ్‌తో '12th ఫెయిల్' సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే... మనోజ్ కుమార్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కింది. 12వ తరగతి ఫెయిల్ అయిన యువకుడు.. ఐపీఎస్ ఎలా అయ్యాడనే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచేందుకు పోటీపడనుందని తెలుస్తోంది. జనరల్ కేటగిరిలో చిత్రబృందం ఈ సినిమాను నామినేషన్ వేసింది. మరి చూడాలి ఇక.


Click it and Unblock the Notifications











