OTTలోకి సరికొత్త కామెడీ థ్రిల్లర్.. భయపడుతూనే కడుపుబ్బా నవ్వే ఈ మూవీని ఎలా చూడాలంటే?
ఈ మధ్య కాలంలో అనేక అదిరిపోయే సినిమాలు ఓటీటీ వేదికగా వస్తూ అలరిస్తున్నాయి. ఏ కొత్త సినిమా, వెబ్ సిరీస్ వచ్చినా అస్సలే మిస్ అవకుండా చూసేస్తున్నారు. ముఖ్యంగా హార్రర్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రాలు, వెబ్ సిరీస్ లు వస్తే అస్సలే మిస్ కావట్లేదు. ఈ విషయం అర్థం చేసుకున్న దర్శక, నిర్మాతల అదిరిపోయే క్రైమ్, థ్రిల్లర్, హార్రర్, మిస్టరీ సినిమాలు, వెబ్ సిరీస్ లను తీసుకువస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఓటీటీలో అనేక క్రేజీ చిత్రాలు ఉండగా.. తాజాగా మరో మంచి సరికొత్త కామెడీ థ్రిల్లర్ ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
12త్ ఫెయిల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విక్రాంత్ మాస్సే హీరోగా, బాలీవుడ్ క్యూట్ బ్యూటీ మౌనీ రాయ్ హీరోయిన్ గా చేసిన క్రేజీ కామెడీ థ్రిల్లర్ మూవీయే బ్లాక్ ఔట్. ఈ సినిమాను దేవంగ్ భవసార్ డైరెక్టర్ చేయగా.. సునీల్ గ్రోవర్, కరణ్ సోనావానే, జిషు సేన్ గుప్తా, కరణ్ సోనావానే, సౌరభ్ గాగ్డే, ప్రసాద్ ఓక్, రుహానీ శర్మ, అనంత్ జోషి, చాయా కడెం, సూరజ్ పాప్స్, కెల్లీ దోర్జీ, విషాఖ త్యాగిలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.

2021లో ప్రకటించిన ఈ క్రేజీ మూవీ ఎప్పుడూ షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ విడుదలకు మాత్రం నోచుకోలేదు. అయితే దాదాపు మూడేళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ముఖ్యంగా నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన సోనీ లివ్ వేదికగా ఈ క్రేజీ మూవీ ఓటీటీలో విడుదల చేయనున్నారు. జూన్ 7వ తేదీ నుంచి విక్రాంత్ మాస్సే, మౌనీరాయ్ లు హీరోహీరోయిన్లుగా చేసిన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ఎక్స్ వేదికగా ప్రకటించారు.

12th ఫెయిల్ హీరో... హీరోగా చేసిన ఈ సినిమా చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా హాట్ బ్యూటీ మౌనీ రాయ్, రుహానీ శర్మలు కూడా ఈ సినిమాలో నటించడం ప్లస్ అయిందనే చెప్పొచ్చు. మరి అద్భుతమైన కామెడీ థ్రిల్లర్ గా జూన్ 7వ తేదీ నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమాను.. థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వాళ్లు కచ్చితంగా చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











