Don't Miss!
- Lifestyle
స్త్రీ, పురుషులు ఇద్దరూ తమ సంతానోత్పత్తని మెరుగుపరుచుకోవడానికి ఇవి తినాలి!
- News
Republic Day 2023 : ఈసారి రిపబ్లిక్ డే పరేడ్ లో అన్నీ ప్రత్యేకతలే-ఇవన్నీ తొలిసారి ?
- Technology
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
- Sports
INDvsNZ : మూడో వన్డేలో టాప్ స్కోర్ చేసే బ్యాటర్ ఎవరు?.. ఈ ముగ్గురి మధ్య పోటీ!
- Finance
Ford Layoffs: మెున్న ఐటీ ఇప్పుడు ఆటోనూ.. ఆగని ఉద్యోగాల కోతలు.. మెగా లేఆఫ్
- Automobiles
మాజీ విశ్వ సుందరి 'సుస్మితా సేన్' మనసు దోచిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Lathi OTT: ఓటీటీలోకి విశాల్ లాఠీ సినిమా.. సంక్రాంతి కానుకగా.. ఎందులో అంటే?
తమిళ స్టార్ హీరో విశాల్ కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అందుకే ఆయన ప్రతి సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తుంటారు. పేరుకే విశాల్ తమిళ హీరో అయినా తెలుగులో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. సామాజిక అంశాలపై ఎక్కువగా సినిమాలు చేసే విశాల్ తాజాగా నటించిన చిత్రం లాఠీ. యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లాఠీ సినిమాలో విశాల్ పోలీస్ కానిస్టేబుల్ గా ఆకట్టుకున్నాడు. అయితే డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా ఊహించినంత స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. దీంతో ఈ సినిమాను త్వరగానే ఓటీటీలో విడుదల చేస్తున్నారు.

ప్రజల్లో మంచి క్రేజ్..
కోలీవుడ్ హీరో విశాల్ కు తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉంది. సామాజిక అంశాలపై ఎక్కువగా సినిమాలు తెరకెక్కిస్తూ తనదైన శైలీలో ముందుకు సాగుతున్నాడు హీరో విశాల్. దాదాపుగా ఆయన సినిమాలన్నీ తెలుగులో డబ్ అవుతుంటాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ కూడా సాధించాయి. సినిమాలతోపాటు విశాల్.. సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఇలా ఆయనకు ప్రజల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇటీవల అభిమన్యు, యాక్షన్, ఎన్మీ చిత్రాలతో అలరించిన విశాల్ ఇటీవల లాఠీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

పాన్ ఇండియా చిత్రంగా..
రానా ప్రొడక్షన్స్ పై రమణ, నంద సంయుక్త నిర్మాణంలో రూపొందిన లాఠీ సినిమాలో విశాల్ కు జోడిగా సునయన నటించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అలాగే రమణ, ప్రభు, వినోదిని, మోహన్ రామన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇందులో విశాల్ సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ గా ఆకట్టుకున్నాడు. నగరంలోని రౌడీలపో పోరాటం చేస్తూ తన కొడుకుని ఒక కానిస్టేబుల్ ఎలా కాపాడుకున్నాడన్నదే లాఠీ సినిమా కథ. ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా డిసెంబర్ 22న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

అధికారిక ప్రకటన..
డిసెంబర్ 22న విడుదలైన ఈ లాఠీ చిత్రం తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. నటనపరంగా విశాల్ ఆకట్టుకున్నప్పటికీ స్లో నేరేషన్, స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు రుచించలేదు. దీంతో ఇప్పుడు వెంటనే డిజిటల్ తెరపైకి తీసుకొస్తున్నారు మేకర్స్. లాఠీ సినిమాను ఓటీటీలోకి సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ సన్ ఎన్ఎక్స్టీ (SUN NXT)లో జనవరి 14 నుంచి లాఠీ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని SUN NXT ఫ్లాట్ ఫామ్ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. మరి వెండితెరపై అంతగా ఆకట్టుకోని విశాల్ లాఠీ చిత్రం డిజిటల్ తెరపై ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.
Laththi all set to stream on 14 Jan only on Sun NXT#SunNXT #Laththi #LaththiCharge #Vishal #Sunaina #Prabhu #Munishkanth #MeeshaGhoshal #ThalaivasalVijay #AVinothKumar @VishalKOfficial @TheSunainaa pic.twitter.com/EZNW2heatY
— SUN NXT (@sunnxt) January 12, 2023