Mark Antony on OTT: ఓటీటీలోకి 100 కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమా.. ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
Mark Antony on OTT:టైమ్ ట్రావెల్ నేపథ్యంలో విశాల్ హీరోగా వచ్చిన మూవీ మార్క్ ఆంటోని. తెలుగులో యావరేజ్ టాక్ అందుకున్నప్పటికీ తమిళంలో మాత్రం టాక్ అందుకుంది. కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీకి మంది రెస్పాన్స్ వచ్చింది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ టేకింగ్ కూడా కొత్తగా ఉండటంతో తమిళంలో మంచి ఆదరణ చూరగొంది.
తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేక పోయింది. కానీ తమిళ తంబీలు మాత్రం కనెక్టై పోయి ఎగబడి చూసేశారు. అలా రూ. 100 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. అత్యధిక వసూళ్లు సాధించిన విశాల్ మూవీగా మార్క్ ఆంటోని నిలిచింది. డ్యూయల్ రోల్ చేసి విశాల్ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇంకా కొన్ని చోట్ల థియేటర్లలో ఉంది. అయితే ఓటీటీ తేదీని తాజాగా ఫిక్స్ చేశారు.

అక్టోబర్ 13వ తేదీ నుంచి మార్క్ ఆంటోని ఓటీటీలోకి రానుంది. అంటే ఈ శుక్రవారమే బుల్లి తెరపై సందడి చేయనున్నాడు మార్క్ ఆంటోని. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో విడుదలకు సిద్ధం అయిపోయింది మార్క్ ఆంటోని. తమిళంతో పాటు తెలుగులోనూ అదే రోజూ ఓటీటీలో విడుదల కానుంది.
హీరోగా విశాల్ తో పాటు ఎస్జే సూర్య అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ మూవీలో సునీల్, రీతూ వర్మ, అభినయ కీలక పాత్రల్లో కనిపించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. 1975, 1995 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాడు దర్శకుడు. ఈ మూవీలో విశాల్ రెండు పాత్రల్లో కనిపించాడు. వివిధ గెటప్పులతో ఫ్యాన్స్ ను మెప్పించాడు.

సైంటిస్ట్ చిరంజీవి(సెల్వ రాఘవన్) టైమ్ ట్రావెల్ చేసేందుకు టెలిఫోన్ కనిపెడతాడు. గ్యాంగ్ స్టర్ ఆంటోని(విశాల్) చనిపోవడంతో కొడుకు మార్క్ ను(విశాల్) అతడి స్నేహితుడు జాకీ మార్తాండ(ఎస్జే సూర్య) సొంత కొడుకులా పెంచుతాడు. 1975లో చిరంజీవి కనిపెట్టిన టైమ్ ట్రావెల్ టెలిఫోన్ మార్క్ కు దొరుకుతుంది. ఆ ఫోన్ తో తన తల్లిదండ్రులతో మాట్లాడుతారు మార్క్. అప్పుడే తనకో నిజం తెలుస్తుంది. ఆంటోనీ ఎలా చనిపోతాడు.. మార్క్ తల్లిని చంపిందెవరు.. మార్క్ ను చిరంజీవి ఎలా బతికించుకుంటాడు.. ఈ కథలో ఏకాంబరం(సునీల్) క్యారెక్టర్ ఏంటి లాంటివన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ మూవీ హిందీలో రిలీజ్ కావడం వెనక పెద్ద తతంగమే జరిగింది. అక్కడ సెన్సార్ కోసం తాను లంచం ఇవ్వాల్సి వచ్చిందంటూ విశాల్ సోషల్ మీడియా ద్వారా చెప్పడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై కేంద్ర సర్కారు కూడా స్పందించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











