నెల కాకుండానే ఓటీటీలోకి స్టార్ హీరో మూవీ.. ఈ మాస్ సినిమా ఎక్కడ దొరుకుతుందంటే!
కోలీవుడ్‌కు చెందిన హీరోనే అయినా.. తన నటనతో సౌతిండియా మొత్తంలో మార్కెట్‌ను ఏర్పరచుకుని సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతున్నాడు విశాల్. కెరీర్ ఆరంభం నుంచే హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళ్తోన్న ఈ టాలెంటెడ్ హీరో.. 'మార్క్ ఆంటోనీ'తో క్రేజీ హిట్ కొట్టాడు. ఈ జోష్‌లోనే ఇటీవలే 'రత్నం' మూవీ చేశాడు.
తమిళ స్టార్ హీరో విశాల్ హీరోగా.. మాస్ డైరెక్టర్ హరి తెరకెక్కించిన చిత్రమే 'రత్నం'. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా.. ప్రచార చిత్రాలతో మెప్పించడం ద్వారా ఆరంభంలోనే అందరి దృష్టిలో పడింది. అందుకు తగ్గట్లుగానే ఇది ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా ఏప్రిల్ 26వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రత్నం' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. తెలుగు, తమిళంలోనూ ఇదే పరిస్థితి ఉండడంతో ఆడియెన్స్ నుంచి అనుకున్న విధంగా రెస్పాన్స్ లభించలేదు. ఫలితంగా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టడంలో పూర్తిగా విఫలం అయింది. దీంతో విశాల్ సినిమా భారీ నష్టాలతో రన్ ముగించాల్సి వచ్చింది.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'రత్నం' సినిమాపై మొదటి నుంచీ అంచనాలు భారీ స్థాయిలోనే ఉండడంతో.. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌కు అదిరిపోయే పోటీ ఏర్పడింది. దీంతో తీవ్ర పోటీ నడుమ అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ హక్కుల కోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్నే చెల్లించినట్లు కోలీవుడ్ మీడియాలో ద్వారా తెలిసింది.
మొదట 'రత్నం' సినిమాను థియేటర్లలోకి వచ్చిన 4 వారాల తర్వాతనే స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని అన్నారు. కానీ, ఈ మూవీ రిజల్ట్ తారుమారు కావడంతో ఇప్పుడు నెల లోపే స్ట్రీమింగ్ చేయబోతున్నారని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. విశాల్ సినిమాను మే 24వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా.. 'రత్నం' మూవీలో విశాల్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించింది. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంస్థలపై కార్తికేయన్ సంతానం, అలంకార్ పాండియన్ నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతాన్ని అందించాడు. ఇందులో గౌతమ్ మీనన్, యోగిబాబు, సముద్రఖని, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











