ఓటీటీలో రిలీజ్ అయిన ఊరమాస్ మూవీ.. స్టార్ హీరో సినిమాను ఎలా చూడాలంటే!
తమిళ హీరోనే అయినా సౌత్ ఇండియా మొత్తంలో ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను ఏర్పరచుకున్న హీరోనే విశాల్. మంచి సినిమా బ్యాగ్రౌండ్‌తో వచ్చిన అతడు.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇలా హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా మూవీలు చేస్తున్నాడు. ఇలా 'మార్క్ ఆంటోనీ' వంటి హిట్ తర్వాత విశాల్ 'రత్నం' మూవీ చేశాడు.
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌తో మాస్ డైరెక్టర్ హరి రూపొందించిన చిత్రమే 'రత్నం'. ఫుల్ లెంగ్త్ ఊరమాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా.. ప్రచార చిత్రాలతో మెప్పించడం ద్వారా ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు తగ్గట్లుగానే ఇది ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా ఏప్రిల్ 26వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అయింది.

భారీ అంచనాల నడుమ ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చిన 'రత్నం' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. తెలుగు, తమిళంలోనూ ఇదే పరిస్థితి ఉండడంతో ఆడియెన్స్ నుంచి అనుకున్న విధంగా రెస్పాన్స్ లభించలేదు. ఫలితంగా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టడంలో పూర్తిగా విఫలం అయింది. దీంతో విశాల్ సినిమా భారీ నష్టాలతో రన్ ముగించింది.
పవర్‌ఫుల్ కాంబోలో రూపొందిన 'రత్నం' సినిమాపై మొదటి నుంచీ అంచనాలు భారీ స్థాయిలోనే ఉండడంతో.. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులకు అదిరిపోయే పోటీ ఏర్పడింది. దీంతో మంచి డిమాండ్ నడుమ అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ హక్కుల కోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్నే చెల్లించినట్లు కోలీవుడ్ మీడియా వెల్లడించింది.

విశాల్ హీరోగా నటించిన 'రత్నం' సినిమాను మే 23 నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తామని అమెజాన్ ప్రైమ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఈ అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో సెన్సార్‌లో కట్ అయిన సన్నివేశాలతో పాటు కొన్ని డైలాగులను కూడా యాడ్ చేసినట్లు తెలిసింది. దీంతో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది.
ఇదిలా ఉండగా.. 'రత్నం' సినిమాలో విశాల్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించింది. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంస్థలపై కార్తికేయన్ సంతానం, అలంకార్ పాండియన్ నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతాన్ని అందించాడు. ఇందులో గౌతమ్ మీనన్, యోగిబాబు, సముద్రఖని, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలను పోషించారు.


Click it and Unblock the Notifications











