Vishnu Vinyasam OTT: విష్ణు విన్యాసం ఓటీటీ రిలీజ్.. శ్రీవిష్ణు మూవీ ఏ ఓటీటీలో? స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కింగ్ ఆఫ్ ఎంటర్‌టైనర్ శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ విష్ణు విన్యాసం. కామెడీ, ఫ్యామిలీ, ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌లో సుమంత్ నాయుడు జీ నిర్మించారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటించారు. సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. విష్ణు విన్యాసం మూవీకి యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహించారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా.. రాదన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీకేయన్ రోహిణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఫిబ్రవరి 27వ తేదిన విష్ణు విన్యాసం మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో విష్ణు విన్యాసం మూవీకి ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే..
విష్ణు విన్యాసంకు రికార్డ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి విష్ణు విన్యాసం మూవీకి 19 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. టీజర్, ట్రైలర్‌తో పాటు శ్రీవిష్ణు సినిమాల క్రేజ్ నేపథ్యంలో ఈ మూవీపై హైప్ నెలకొంది. గతంలో రిలీజైన శ్రీవిష్ణు సినిమాలు మంచి వసూళ్లను రాబట్టడంతో విష్ణు విన్యాసంపైనా అంచనాలు నెలకొన్నాయి. చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను భారీగా నిర్వహించడం కూడా కలిసొచ్చింది.

విష్ణు విన్యాసంకు రిలీజ్‌కు ముందే లాభాలు
విష్ణు విన్యాసం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్ల నుంచి మంచి పోటీ కనిపించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కింద ఈ సినిమా ఇప్పటికే 26 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దాంతో 19 కోట్ల రూపాయల పెట్టుబడి మీద దాదాపు 7 కోట్ల రూపాయల ట్రేబుల్ ప్రాఫిట్‌ను అందించాడు శ్రీవిష్ణు. రిలీజ్‌కు ముందే భారీ లాభాలు తీసుకురావడంతో ఈ స్టార్ ఎంటర్‌టైనర్‌పై నమ్మకంతో పాటు.. విష్ణు విన్యాసం బిజినెస్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. దాంతో విష్ణు విన్యాసంకు థియేటర్‌లో వచ్చేదంతా నిర్మాతలకు అదనపు లాభమే.
విష్ణు విన్యాసం ప్రీమియర్స్ కలెక్షన్స్
విష్ణు విన్యాసం మూవీకి బుకింగ్స్ ఓపెన్ అవ్వగా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అటు యూఎస్ ప్రీమియర్స్‌కు కూడా ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. విష్ణు విన్యాసం మూవీకి 247 సెంటర్స్‌కు గాను 369 షోలు ఏర్పాటు చేయగా... 2818 టికెట్లు అమ్ముడయ్యాయి. దాంతో విష్ణు విన్యాసం మూవీకి 41432 డాలర్లు (భారత కరెన్సీలో 38 లక్షల రూపాయలు) వసూలైంది.
విష్ణు విన్యాసం ఓటీటీ డిటెయిల్స్
ఇదిలాఉండగా.. విష్ణు విన్యాసం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుందని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. అయితే ఆ డీల్ వాల్యూ ఎంత అనేది మాత్రం తెలియరాలేదు. థియేటర్‌లో రిలీజైన 4 నుంచి 8 వారాల తర్వాత విష్ణు విన్యాసం మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకురావాలనే నిబంధన కింద ఈ ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది. దీనిని బట్టి మార్చి చివరి వారంలో శ్రీవిష్ణు మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే థియేట్రికల్ రన్‌ను బట్టి విష్ణు విన్యాసం మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ముందుగా రావొచ్చు.. లేదంటే ఆలస్యం కావొచ్చు. దీనిపై అమెజాన్ ప్రైమ్ వీడియో త్వరలోనే క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications











