Das Ka Dhamki 2: సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన విశ్వక్ సేన్.. 'ఆహా'తో మరో సర్‌ప్రైజ్ ప్రాజెక్ట్!
ఫలక్ నూమా దాస్ చిత్రంతో డైరెక్టర్ గా మారాడు విశ్వక్ సేన్. ఈ సినిమాలో హీరోగాపాటు దర్శకత్వం వహించి సత్తా చాటాడు. ఇటీవలే విశ్వక్ సేన్ మరోసారి హీరోగా, డైరెక్టర్గా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ సినిమానే 'దాస్ కా ధమ్కీ'. సుమారు నాలుగేళ్ల తర్వాత విశ్వక్ సేన్ మెగా ఫోన్ పట్టుకున్న ఈ చిత్రం ఉగాది సందర్భంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవలే ఏప్రిల్ 14 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చాడు విశ్వక్ సేన్.
మాస్ హీరో విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు రెండోసారి నిర్మించిన చిత్రం దాస్ కా ధమ్కీ. ఉగాది పండుగ సందర్భంగా మార్చి 22న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ వరల్డ్ వైడ్ గా 650 థియేటర్లలో అయింది. ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. విశ్వక్ సేన్, బ్యూటిఫుల్ నివేదా పేతురాజ్ రెండోసారి జత కట్టిన విషయం తెలిసిందే.

థియేటర్లలో విడుదలైన విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ' సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ పెద్దగా అందుకోలేకపోయింది. అయితే ఇటీవల ఏప్రిల్ 14 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్నారు. కానీ ఓటీటీలో మాత్రం భారీ స్పందన అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ తో పాటు ఆహా కంటెంట్ హెడ్ వాసు పాల్గొన్నారు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ "దాస్ కా ధమ్కీ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేస్తున్న ఆహా టీమ్ కు థ్యాంక్స్. ఐపీఎల్ సీజన్ లో కూడా అందరూ రిపీటెడ్ గా సినిమా చూస్తుండటం సంతోషంగా ఉంది. ఇంతటి ఆదరణ పొందుతున్న ఈ సినిమాకు వచ్చే ఏడాది సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం. ఈ సీక్వెల్ మూవీ ఫస్ట్ పార్ట్ కంటే పది రెట్లు ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తుంది" అని వెల్లడించాడు.

"అశోకవనంలో అర్జున కల్యాణం మూవీ నుంచి విశ్వక్ తో మా జర్నీ మొదలింది. 2022లో ఈ సినిమా ఆహా ప్లాట్ ఫామ్ లోని టాప్ త్రీ మూవీస్ లో ఒకటిగా నిలించింది. ఇక దాస్ కా ధమ్కీ సినిమా మాత్రం విశ్వక్ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్. ఆహాలో ఇప్పటికే 100 మిలియన్ వ్యూయంగ్ మినిట్స్ కంప్లీట్ చేసుకుంది. మరో రెండు మూడు రోజుల్లో 250 మిలియన్ మినిట్స్ దాటేస్తుంది. అంతేకాదు ఆహాతో విశ్వక్ కలిసి ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు. అది త్వరలోనే అనౌన్స్ చేస్తాం" అని ఆహా కంటెంట్ హెడ్ వాసు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











