Das Ka Dhamki OTT: 3 వారాల్లోనే ఓటీటీలోకి విశ్వక్ ధమ్కీ.. అనూహ్యంగా ఆరోజు నుంచి స్ట్రీమింగ్!
ఫలక్ నూమా దాస్ చిత్రంతో డైరెక్టర్ గా మారాడు విశ్వక్ సేన్. ఈ సినిమాలో హీరోగాపాటు దర్శకత్వం వహించి సత్తా చాటాడు. ఇటీవలే విశ్వక్ సేన్ మరోసారి హీరోగా, డైరెక్టర్గా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ సినిమానే 'దాస్ కా ధమ్కీ'. సుమారు నాలుగేళ్ల తర్వాత విశ్వక్ సేన్ మెగా ఫోన్ పట్టుకున్న ఈ చిత్రం ఉగాది సందర్భంగా మార్చి 22న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మిక్స్ డ్ టాక్ అందుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడు తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. దాస్ కా ధమ్కీ డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్, రిలీజ్ డేట్ వివరాలపై ఓ లుక్ వేస్తే..
మాస్ హీరో విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు రెండోసారి నిర్మించిన చిత్రం దాస్ కా ధమ్కీ. ఉగాది పండుగ సందర్భంగా మార్చి 22న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల అయింది. ఈ మూవీకి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడం, ప్రమోషన్స్ లో బాలకృష్ణ పాల్గొనడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది.

విశ్వక్ సేన్, బ్యూటిఫుల్ నివేదా పేతురాజ్ రెండోసారి జత కట్టిన 'దాస్ కా ధమ్కీ' సినిమా వరల్డ్ వైడ్ గా 650 థియేటర్లలో విడుదల అయింది. విశ్వక్ సేన్ తొలిసారిగా డ్యూయల్ రోల్ పోషించిన ఈ సినిమాకు పెద్దగా మౌత్ టాక్ రాలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. కానీ డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. ఇక ఇటీవలే ఈ మూవీ థియేట్రికల్ రన్ క్లోజ్ కావడంతో తాజాగా డిజిటల్ పార్టనర్ ఓటీటీ స్ట్రీమింగ్ తేదిని విడుదల చేసింది.
వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై వచ్చిన దాస్ కా ధమ్కీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఇక ఏప్రిల్ 14 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు గురువారం ప్రకటించారు. అయితే దాస్ కా ధమ్కీ విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది. ఇక ముందుగా అమెజాన్ ప్రైమ్ వేదికగా, 5 వారాల తర్వాత ఈ సినిమా వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ అంచనాలకు మించి అనూహ్యంగా ఆహాలో మూడు వారాలకే రిలీజ్ కానుంది ఈ సినిమా.


Click it and Unblock the Notifications











