OTT: సైలెంట్ గా ఓటిటిలోకి మాస్ హీరో ఫైనాన్సియల్ క్రైమ్ థ్రిల్లర్.. ఎందులో చూడొచ్చంటే
ట్రెండ్ మారుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు కొత్త రక్తం తెలుగు సినిమా దగ్గర వస్తూనే ఉంటుంది. ఇలా వస్తున్న లేటెస్ట్ యువ హీరో, హీరోయిన్స్ ఏదొకలా లైమ్ లైట్‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ప్రెజెంట్ మన తెలుగు కుర్రాళ్లలో మంచి క్రేజ్ ఉన్న కొందరు యువ హీరోలు ఉన్నారు. ఇలాంటి వారిలో మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ కూడా ఒకడు.
విశ్వక్‌సేన్ హీరోగా తన కెరీర్ లో చేసిన అన్ని సినిమాలు తన సినిమా టేస్ట్‌ని చూపిస్తాయి. ఈ సినిమాలు బాగానే ఉన్నప్పటికీ ఆఫ్ లైన్‌లో తన నేచర్‌పై మాత్రం పలు కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. ఈ కామెంట్స్‌లో తన ఓవర్ కాన్ఫిడెన్స్ అని.. కొన్ని ఓవర్ మాటలు వంటివి కొందరికి నచ్చితే కొందరికి నచ్చడం లేదు. అయితే ఇవి నానాటికీ పెరుగుతూ వస్తుండడంతో తన సినిమాలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి.

ఇలా తన మాటలు బాగున్నప్పటికీ , కంటెంట్ బాగున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర విఫలం అయ్యిన లేటెస్ట్ సినిమా ఒకటి సైలెంట్‌గా ఓటిటిలో ప్రత్యక్షం అయ్యింది. ఈ యువ హీరో నటించిన రీసెంట్ చిత్రమే "మెకానిక్ రాకీ". కొత్త దర్శకుడు ముళ్ళపూడి రవితేజ తెరకెక్కించిన ఈ చిత్రం పైడ్ ప్రీమియర్స్ తోనే మంచి టాక్ తెచ్చుకుంది. కానీ విశ్వక్ గత అన్ని సినిమాల కంటే చాలా తక్కువ వసూళ్లు అందుకుంది.
దీనికి కారణం ఈ సినిమా ప్రీ రిలీజ్, ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్‌లో విశ్వక్ అతి ప్రవర్తనే కారణం అని కొందరు అంటారు. తన మాటల వల్లే సినిమా బాగున్నప్పటికీ థియేటర్స్ లోకి జనం రావడం లేదు అనే కామెంట్స్ వినిపించాయి. మరి అక్కడ ఏమో కానీ ఇపుడు ఎట్టకేలకి ఈ చిత్రం ఓటిటిలో వచ్చేసింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ల విషయంలో జరిగే పలు ఫైనాన్సియల్ స్కామ్ లపై ఓ సాలిడ్ థ్రిల్లర్ గా మెకానిక్ రాకీని తెరకెక్కించారు.

ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ బాగుంది అని మంచి టాక్ వచ్చింది కానీ సినిమా మాత్రం వసూళ్ల పరంగా ప్లాప్ గానే మిగిలిపోయింది. ఇక ఫైనల్ గా ఈ చిత్రం ఈరోజు నుంచి స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఓటిటిలో మాత్రం మెకానిక్ రాకీ డెఫినెట్‌గా ఆకట్టుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.
ఇక ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా జెర్సీ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్ ఒక సర్ప్రైజింగ్ రోల్ లో కనిపించింది. అలాగే ఈ చిత్రానికి సరిపోదా శనివారం ఫేమ్ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు. ఆలాగే "35 చిన్న కథ కాదు" ఫేమ్ నటుడు విశ్వదేవ్ రాచకొండ కూడా కీలక పాత్ర పోషించాడు. మరి ఓటిటిలో మెకానిక్ రాకీ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











