OTT Release: 'ఓరి దేవుడా' మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..
తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ఓ మై కడువులే అనే సినిమా కథను తెలుగులో 'ఓరి దేవుడా' పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా హీరో వెంకటేష్ స్పెషల్ పాత్రలో కనిపించాడు. ఇక ఈ సినిమా గత నెల అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. థియేటర్లలో మంచి ఓపెనింగ్ అందుకున్న ఓరి దేవుడా సినిమా ఓవర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు అయితే ఈ సినిమాను ఓటీటీలో కూడా చూడాలని ఎదురుచూస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
ఈ సినిమా ఓటీటీ హక్కులను ఆహా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అనుకున్న డేట్ కంటే ఈ సినిమా ముందుగానే రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అసలైతే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 40 రోజుల తర్వాతనే ఈ సినిమా ఓటీటీలో వస్తుందని అనుకున్నారు. అయితే ఇప్పుడు నవంబర్ 11 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆహా ఓటీడీ ప్లాట్ ఫామ్ లో మిడ్ నైట్ 12 గంటల నుంచి ఈ సినిమా సందడి చేయనున్నట్లు అధికారికంగా తెలియజేశారు.

ఈ సినిమాలో విశ్వక్సేన్ కు జోడిగా మిథిలా పాల్కర్ ఆశాభట్ నటించిన విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా విశ్వక్ నటనకు కూడా మంచి టాక్ వచ్చింది. హీరోయిన్స్ ఇద్దరికి కూడా ఇది మొదటి సినిమా అయినప్పటికీ చాలా బాగా నటించారు. ఇక ఈ సినిమాకు ఒరిజినల్ తమిళ దర్శకుడు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించగా పెళ్లిచూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాటలు అందించాడు. ఇక ఈ సినిమాను పీవీపీ సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవల కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న విశ్వక్ ఓరి దేవుడా సినిమాతో మరోసారి మంచి టాక్ ను సొంతం చేసుకున్నాడు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











