Ori Devuda OTT: నెల కాకముందే ఓటీటీలోకి.. ఓరి దేవుడా ఎందులో వస్తుందంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది కుర్రాళ్లు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు మాస్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకడు. ఆరంభంలోనే అదిరిపోయే ఇమేజ్‌ను దక్కించుకున్న అతడు.. వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తున్నాడు. ఇలా సినిమా సినిమాకూ వేరియేషన్స్ చూపిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో వచ్చాడు.

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో అశ్వత్ మరిముత్తు తెరకెక్కించిన చిత్రమే 'ఓరి దేవుడా'. ఇది 'ఓ మై కడవులే' అనే తమిళ చిత్రానికి రీమేక్‌గా వచ్చింది. ఈ సినిమాను అక్టోబర్ 21వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. దర్శక నిర్మాతల నమ్మకాన్ని నిలబెడుతూ ఈ చిత్రానికి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా 'ఓరి దేవుడా' చిత్రానికి ఆశించిన వసూళ్లు దక్కలేదు. దీంతో ఇది బాక్సాఫీస్ ముందు ఏబో ఏవరేజ్‌గానే నిలిచిపోయింది.

Vishwak Sen Ori Devuda Movie Streaming on AHA from November 11th

ఇక, థియేటర్లలో బాగానే సందడి చేసిన 'ఓరి దేవుడా' మూవీని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, దీనిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వక్ సేన్ నటించిన ఈ మూవీని విడుదలైన నాలుగు వారాల లోపే అంటే నవంబర్ 11వ తేదీ నుంచే ఆహా సంస్థలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రకటనను సదరు సంస్థ అధికారికంగా వదిలింది. దీంతో థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన ప్రేక్షకులంతా ఆహాలో దీన్ని చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

Vishwak Sen Ori Devuda Movie Streaming on AHA from November 11th

విశ్వక్ సేన్ నటించిన 'ఓరి దేవుడా' మూవీలో మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కామియో రోల్‌ చేశారు. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై పరవ్ వీ పొట్లూరి నిర్మించారు. లియాన్ జేమ్స్ దీనికి సంగీతం ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X