Boo OTT: నేరుగా ఓటీటీలోకి విశ్వక్ సేన్ రకుల్ ప్రీత్ మూవీ.. ఎక్కిళ్లతోనే భయపెట్టిస్తున్న 'బూ'
ఫలక్ నూమా దాస్ చిత్రంతో డైరెక్టర్ గా మారిన విశ్వక్ సేన్ ఇటీవల మరోసారి దర్శకత్వం వహించిన సినిమా దాస్ కా ధమ్కీ. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నివేదా పేతురాజ్ గ్లామర్ ఒలకబోసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నివేదా పేతురాజ్, విశ్వక్ సేన్ తోపాటు ఫిట్ నెస్ పాప రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సినిమా బూ (Boo). హారర్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. అందుకు గల కారణాలు, తదితర వివరాల్లోకి వెళితే..
హిందీ మూవీలాగే: స్లిమ్ బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు చేసింది లేదు. ఎక్కువగా హిందీ చిత్రాలతోనే ఫుల్ బిజీగా ఉంది. కానీ ఆ సినిమాలు ఏవి ఆమెకు హిట్టును అందించలేకపోయాయి. అప్పట్లో తెలుగులో చేసిన కొండపొలం కూడా డిజాస్టర్ గా నిలిచింది. రకుల్ ప్రీత్ హిందీ సినిమాలు కొన్ని ఓటీటీలో విడుదలయ్యాయి. మళ్లీ ఇప్పుడు ఆమె నటించిన తెలుగు సినిమా కూడా నేరుగా ఓటీటీలోకే రానుంది.

నో పబ్లిసిటీ.. ప్రమోషన్స్: అయితే విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన ఓ సినిమా ఉందని ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఈ సినిమా గురించి మేకర్స్ నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ కూడా విడుదల కాలేదు. పబ్లిసిటీ సైతం చేయలేదు. అందుకే ఇలాంటి ఓ మూవీ ఉందని ప్రేక్షకులకు తెలియలేదు. అయితే ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి రానున్నట్లు ప్రకటించి సర్ ప్రైజ్ ఇచ్చారు 'బూ' (Boo OTT) మూవీ మేకర్స్.
ఐదుగురు హీరోయిన్లు: బూ అనే సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన బైలింగువల్ హారర్ థ్రిల్లర్ మూవీ. తమిళ డైరెక్టర్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్, నివేదా పేతురాజ్ తోపాటు మేఘా ఆకాష్, మంజిమా మోహన్, రెబా మోనికా జాన్ వంటి పాపులర్ హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే 30 ఇయర్స్ పృథ్వీ, విద్యుల్లేఖ రామన్ కూడా యాక్ట్ చేశారు.

అనివార్య కారణాలు: జీ స్టూడియోస్ సమర్పణలో శర్వంత్ రామ్ క్రియేషన్స్, షిరిడి సాయి మూవీస్ బ్యానర్స్ పై జ్యోతి దేశ్ పాండే నిర్మించారు. జవ్వాజి రామాంజనేయులు, ఎం రాజశేఖర్ రెడ్డి సహా నిర్మాతలుగా వ్యవహరించారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. అయితే ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అనివార్య కారణాల వల్ల రిలీజ్ ఆలస్యం అవుతూ వచ్చింది.
ఆ ఓటీటీలో స్ట్రీమింగ్: బూ సినిమాను ఇప్పుడు ఎట్టకేలకు థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా టీజర్ ను విడుదల చేశారు. "ఈసారి మీకు ఎక్కిళ్లు వస్తే నీళ్ల కోసం చూడకండి. ఒకసారి చుట్టూ చూడండి. మీ పరిసరాల్లో దెయ్యం ఉండే ఛాన్స్ ఉంది" అని ట్వీట్ చేశారు. దీన్ని మే 27 నుంచి తెలుగు, తమిళంలో జియో సినిమా (JioCinema) ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఎక్కిళ్లు కీలకంగా: టీజర్ లో ఒక హాంటెడ్ హౌజ్ లో రాత్రి పూట సినిమా జరుగుతున్నట్లుగా ఉంది. హాలోవిన్ కథలు అంటూ బుక్ చూపించడం, అందులో ఎక్కిళ్ల గురించి ఉండటం, అలాగే ఓ ఇంటికి వెళ్లిన నివేదా పేతురాజ్ ను ఓ పెద్దావిడ నీకు ఎక్కిళ్లు వస్తాయా అని అడగడంతో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. అందులో భయపెట్టేలా ఎక్కిళ్ల శబ్ధం రావడం సరికొత్తగా ఉంది.


Click it and Unblock the Notifications











