Gaami OTT: ఫేమస్ ఓటీటీలో హాలీవుడ్ రేంజ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలిస్తే!
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎలాంటి సపోర్ట్ లేకుండానే వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తనదైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించి.. ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. కెరీర్‌ను ఫుల్ జోష్‌తో ముందుకు తీసుకు వెళ్తున్నాడు. ఇలా ఇప్పుడు 'గామి' అనే సినిమాను చేశాడు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా.. విద్యాధర్ కాగిత రూపొందించిన చిత్రమే 'గామి'. ఓ వింత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న హీరో.. పరిష్కారం కోసం హిమాలయాలకు వెళ్లడం.. అక్కడ అతడికి ఎన్నో అడ్డంకులు రావడం.. వాటి నుంచి ఎలా బయటపడ్డాడు అనే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. దీంతో ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని తాజాగా ఇది రిలీజ్ అయింది.

విశ్వక్ సేన్ నటించిన 'గామి' సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి గత రాత్రి ప్రదర్శించిన ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చింది. మరి ఇదే కంటిన్యూ అవుతుందో లేదో ఆసక్తికరంగా మారింది. బుకింగ్స్ మాత్రం దీనికి చాలా బాగా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'గామి' మూవీ ఓటీటీ వివరాలు బయటకు వచ్చేశాయి.
'గామి' సినిమా సందడి ఇప్పటికే థియేటర్లలో మొదలైపోగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా రివీల్ అయ్యాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ జీ5 సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఇక, ఈ హక్కుల కోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్నే చెల్లించినట్లు కూడా తెలిసింది.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన 'గామి' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా జీ5 సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. అంటే మార్చి 8వ తేదీన విడుదలైన 'గామి' చిత్రం ఏప్రిల్ రెండో వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉండగా.. విశ్వక్ సేన్ - విద్యాధర్ కాంబోలో రూపొందిన 'గామి' మూవీని యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మించారు. నరేష్ కుమరాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇందులో చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటించగా.. అభినయ కీలక పాత్రను చేసింది. అలాగే, మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావు తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











