Gaami OTT: ఓటీటీలోకి బిగ్ హిట్ మూవీ.. విశ్వక్ సేన్ మూవీ డేట్ ప్రకటన
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు మార్కెట్‌ను కూడా భారీగా పెంచుకున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లను సొంతం చేసుకుంటోన్న అతడు.. ఇటీవలే 'గామి' అనే ప్రయోగాత్మక చిత్రంతో వచ్చాడు. కొత్త పాయింట్‌తో వచ్చిన ఈ చిత్రం భారీ హైప్ క్రియేట్ చేసుకుంది.
టాలెంటెడ్ గాయ్ విశ్వక్ సేన్ హీరోగా.. విద్యాధర్ కాగిత అనే యంగ్ డైరెక్టర్ రూపొందించిన సినిమానే 'గామి'. గతంలో ఎన్నడూ చూడని సబ్జెక్టుతో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అనుకున్నట్లుగానే దీనికి మంచి టాక్‌తో పాటు రెస్పాన్స్, వసూళ్లు కూడా భారీగా లభించాయి.

విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'గామి' సినిమా భారీ లాభాలతో రన్‌ను ముగించుకుంది. దీంతో కొద్ది రోజులుగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ5 సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. దీంతో ఈ ప్లాట్‌ఫాం నుంచి ప్రకటన కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
విద్యాధర్ కాగిత - విశ్వక్ సేన్ కాంబినేషన్‌లో రూపొందిన 'గామి' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ఫలానా రోజున రాబోతుందని ఎన్నో తేదీలు కూడా తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తారని ఇటీవలే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా జీ5 సంస్థ నుంచి 'గామి' ఓటీటీ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన 'గామి' సినిమాను ఏప్రిల్ 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకు రాబోతున్నట్లు జీ5 సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్‌గా ఓ పోస్టర్‌ను కూడా వదిలింది. ఇక, ఇందులో సెన్సార్ అవని కంటెంట్‌ను చూపించబోతున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
ఇదిలా ఉండగా.. విశ్వక్ సేన్ - విద్యాధర్ కాంబోలో వచ్చిన 'గామి' మూవీని యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మించారు. ఇందులో చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటించగా.. అభినయ కీలక పాత్రను చేసింది. అలాగే, మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావులు కీలక పాత్రలు పోషించారు. నరేష్ కుమరాన్ దీనికి మ్యూజిక్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











