నెల కాకుండానే ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ.. ఎప్పుడు? ఎందులో వస్తుందంటే!

టాలీవుడ్‌లోకి ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది టాలెంట్ ఉన్న కుర్రాళ్లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరైతే అదిరిపోయే ఇమేజ్‌ను అందుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకడు. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతోన్న అతడు.. ఈ జోష్‌లోనే ఇటీవలే 'గామి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన 'గామి' సినిమాను విద్యాధర్ కాగిత అనే యంగ్ డైరెక్టర్ తెరకెక్కించాడు. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త పాయింట్‌తో విజువల్ వండర్‌గా రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఇక, ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వచ్చాయి.

Vishwak Sen Starrer Gaami Movie OTT Streaming Date Locked

విశ్వక్ సేన్ నటించిన 'గామి' సినిమా టాక్‌కు అనుగుణంగానే ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం ఆశించిన స్థాయిలో లభించింది. ఫలితంగా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. ఇలా వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇలా ఈ చిత్రం లాభాల బాటలో పయణించి దాదాపుగా రన్ ముగించుకుంది.

విద్యాధర్ కాగిత - విశ్వక్ సేన్ కాంబినేషన్‌లో రూపొందిన 'గామి' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫేమస్ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం సదరు సంస్థ మంచి రేటునే ముట్టజెప్పినట్లు ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపించింది. ఇక, ఇప్పుడు ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌పై అదిరిపోయే న్యూస్ ఒకటి తెగ వైరల్ అవుతోంది.

Vishwak Sen Starrer Gaami Movie OTT Streaming Date Locked

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన 'గామి' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా జీ5 సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని నెల రోజుల లోపే అంటే ఏప్రిల్ 5వ తేదీనే స్ట్రీమింగ్ చేయబోతున్నారట. దీనిపై త్వరలోనే ప్రకటన రాబోతుందని తెలిసింది.

ఇదిలా ఉండగా.. విశ్వక్ సేన్ - విద్యాధర్ కలిసి చేసిన 'గామి' మూవీని యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మించారు. నరేష్ కుమరాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇందులో చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటించగా.. అభినయ కీలక పాత్రను చేసింది. అలాగే, మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావులు కీలక పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X