సూపర్ హిట్ మూవీ ఓటీటీ వాయిదా.. మొన్న హనుమాన్ ఇప్పుడీ సినిమా
తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు వస్తున్నాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మెప్పును పొంది సూపర్ డూపర్ హిట్లు అవుతున్నాయి. అలా ఇటీవలి కాలంలో వచ్చిన క్రేజీ కాన్సెప్టు మూవీనే 'గామి' (Gaami). మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ఈ చిత్రం.. గతంలో ఎన్నడూ చూడని సబ్జెక్టుతో రూపొందింది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా.. విద్యాధర్ కాగిత అనే యంగ్ డైరెక్టర్ తెరకెక్కించిన చిత్రమే 'గామి'. చాలా తక్కువ బడ్జెట్‌తోనే విజువల్ వండర్‌గా రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఇక, ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ భారీగా లభించాయి.

విశ్వక్ సేన్ హీరోగా చేసిన 'గామి' సినిమా టాక్‌కు అనుగుణంగానే ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం ఆశించిన స్థాయిలో దక్కింది. ఫలితంగా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లతో సత్తా చాటింది. ఇలా వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. ఆ తర్వాత కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇలా ఈ చిత్రం లాభాల బాటలో పయణించి థియేట్రికల్ రన్‌ను ముగించుకుంది.
విద్యాధర్ కాగిత - విశ్వక్ సేన్ కలిసి చేసిన 'గామి' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫేమస్ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం సదరు సంస్థ మంచి రేటునే నిర్మాతలకు ఇచ్చినట్లు ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపించింది. ఇక, ఇప్పుడు ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌పై షాకింగ్ న్యూస్ ఒకటి ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.

విశ్వక్ సేన్ నటించిన 'గామి' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ, దీన్ని ఏప్రిల్ 5 నుంచే స్ట్రీమింగ్ చేస్తారని టాక్ వచ్చింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకు వస్తున్నారట. దీనిపై ఈ వారంలో ప్రకటన వస్తుందని సమాచారం.
ఇదిలా ఉండగా.. విశ్వక్ సేన్ - విద్యాధర్ కలిసి చేసిన 'గామి' మూవీని యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మించారు. ఇందులో చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటించగా.. అభినయ కీలక పాత్రను చేసింది. అలాగే, మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావులు కీలక పాత్రలు పోషించారు. నరేష్ కుమరాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.


Click it and Unblock the Notifications











