ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ రేంజ్ తెలుగు మూవీ.. ఈ హిట్ సినిమాకు ఎందులో చూడాలంటే!
ఒకప్పుడు టాలీవుడ్‌లో ఏవైనా ప్రయోగాత్మక చిత్రాలు చేయాలంటే దర్శక నిర్మాతలు, హీరోలు ఆసక్తి చూపించే వారు కాదు. కానీ, ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచిలో పూర్తిగా మార్పులు వచ్చాయి. దీంతో ఎలాంటి సినిమాను అయినా కంటెంట్ బాగుంటే స్పందనను అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే తెలుగులో వచ్చిన క్రేజీ కాన్సెప్టు మూవీనే 'గామి' (Gaami).
టాలీవుడ్ టాలెంటెడ్ గాయ్ విశ్వక్ సేన్ హీరోగా.. విద్యాధర్ కాగిత అనే డైరెక్టర్ తెరకెక్కించిన చిత్రమే 'గామి'. అంతకు ముందెన్నడూ చూడని సబ్జెక్టుతో రూపొంది ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ మూవీకి మంచి టాక్‌తో పాటు రెస్పాన్స్, వసూళ్లు కూడా భారీగా వచ్చి హిట్ అయింది.

హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో రూపొందిన 'గామి' సినిమా భారీ లాభాలతో రన్‌ను ముగించుకుంది. దీంతో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ఎన్నో రకాల వార్తలు ప్రచారం అవుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న జీ5 సంస్థ ప్రకటన కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన విషయం తెలిసిందే.
విద్యాధర్ కాగిత - విశ్వక్ సేన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'గామి' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ నెల రోజుల లోపలే ప్రారంభం కాబోతుందని మొదటి నుంచీ ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ, అలా జరగలేదు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకు రాబోతున్నట్లు జీ5 సంస్థ ఓ మూడు రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ముందుగా ప్రకటించినట్లుగానే విశ్వక్ సేన్ 'గామి' సినిమాను జీ5 సంస్థ నేటి అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చేసింది. ఇందులో సెన్సార్‌లో కట్ అయిన కొన్ని సన్నివేశాలను కూడా యాడ్ చేసినట్లు తెలిసింది. ఇక, థియేటర్లలో మాదిరిగానే ఓటీటీలో కూడా 'గామి' చిత్రానికి మంచి స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇది ఇందులో కూడా హిట్ అయ్యే చాన్స్ ఉంది.
ఇదిలా ఉండగా.. విశ్వక్ సేన్ - విద్యాధర్ కలయికలో రూపొందిన 'గామి' మూవీని యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మించారు. ఇందులో చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటించగా.. అభినయ కీలక పాత్రను చేసింది. అలాగే, మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావులు కీలక పాత్రలు పోషించారు. నరేష్ కుమరాన్ దీనికి సంగీతం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











