రెండు వారాలకే ఓటీటీలోకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. విశ్వక్ సేన్ నుంచి బిగ్ సర్‌ప్రైజ్
తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోల్లో కొందరు మాత్రమే మాస్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో దాన్నే ఇంటి పేరుగా మార్చుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకడు. వైవిధ్యమైన చిత్రాలతో మెప్పిస్తోన్న అతడు.. ఈ మధ్యన హిట్లు మీద హిట్లు కొడుతోన్నాడు. దీంతో మరింత జోష్‌తో దూసుకెళ్తున్నాడు. ఇలా ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ చేశాడు.
యమా ఫామ్‌తో దూసుకుపోతోన్న విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రమే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. కృష్ణ చైతన్య తీసిన సినిమా రూరల్ పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కింది. దీంతో ఈ మూవీపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని హై రేంజ్‌లో తీశారు. ఈ క్రమంలోనే మే 31వ తేదీన దీన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

విశ్వక్ సేన్ హీరోగా చేసిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాకు ప్రీమియర్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఇది ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో సఫలం అవుతోంది. ఫలితంగా ఈ సినిమాకు మొదటి రోజు మంచి వసూళ్లు మంచిగానే రాబడుతోంది. ఇలా ఇప్పటికే పది కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసింది. తద్వారా హిట్ స్టేటస్‌కు చేరువగా వచ్చేసింది.
ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్‌తో రూపొందిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో నెట్‌ఫ్లిక్స్ సంస్థ వీటిని కొనుగోలు చేసిందట. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు తెలిసింది. ఇక, ఈ సినిమా స్ట్రీమింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ సంస్థ సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌మెంట్ చేసేసింది.

టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాను జూన్ 14వ తేదీ నుంచే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టర్‌ను షేర్ చేయడంతో పాటు ఓ మాస్ డైలాగ్‌ను సైతం క్యాప్షన్‌గా పెట్టింది. మొత్తానికి ఈ సినిమా రెండు వారాల్లోనే ఇది ఓటీటీలోకి రాబోతుండడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా.. అంజలి, నాజర్ కీలక పాత్రలను పోషించారు.


Click it and Unblock the Notifications











