గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీ వివరాలు లీక్.. అన్ని రోజులకే స్ట్రీమింగ్ మొదలు
టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోలు అందరిలోనూ కొందరు మాత్రమే వరుసగా హిట్లను అందుకుంటూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకడు. ఈ మధ్య కాలంలో విజయాల పరంపరతో సత్తా చాటుతోన్న అతడు.. ఫుల్ జోష్‌తో ఫ్యూచర్ ప్రాజెక్టులు లైన్‌లో పెడుతున్నాడు. అలా ఇప్పుడు విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ చేశాడు.
ఫుల్ ఫామ్‌లో ఉన్న విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రమే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. కృష్ణ చైతన్య తీసిన సినిమా రూరల్ పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. దీంతో ఈ మూవీపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని హై రేంజ్‌లో విడుదల చేసుకున్నారు.

విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చింది. తర్వాత క్రమంగా ఇందులో మార్పు వస్తునప్పటికీ ఇది ఆడియెన్స్‌ను రప్పించడంలో సఫలం అవుతోంది. ఫలితంగా ఈ సినిమాకు మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఎమోషనల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా సందడి ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతుండగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా రివీల్ అయ్యాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిందట. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

విలక్షణ నటుడు విశ్వక్ సేన్ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. అంటే మే 31వ తేదీన విడుదలైన ఈ చిత్రం జూలై మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉండగా.. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా.. అంజలి, నాజర్ కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











