ఓటీటీలోకి వచ్చేసిన ఊరమాస్ మూవీ.. 2 వారాలకే వచ్చిన దీన్ని ఎలా చూడాలంటే!
టాలీవుడ్‌లో కొందరు యంగ్ హీరోలు మాత్రమే తమదైన చిత్రాలతో సందడి చేస్తున్నారు. కానీ, వారిలో అతి తక్కువ మంది మాత్రమే స్పెషల్ ఇమేజ్‌తో సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకడు. విలక్షణమైన నటనతో ఆడియెన్స్‌ను ఫిదా చేస్తోన్న ఈ కుర్రాడు.. వరుసగా హిట్లు కొడుతున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ చేశాడు.
హిట్లు మీద హిట్లు కొడుతోన్న విశ్వక్ సేన్ నటించిన తాజా సినిమానే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. కృష్ణ చైతన్య తీసిన సినిమా రూరల్ పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందింది. దీంతో ఈ మూవీపై ఆరంభంలోనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని హై రేంజ్‌లో తెరకెక్కించారు. ఈ క్రమంలోనే మే 31వ తేదీన దీన్ని గ్రాండ్‌గా తీసుకొచ్చారు.

విశ్వక్ సేన్ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాకు ప్రీమియర్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఇది ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించగలిగింది. ఫలితంగా ఈ సినిమాకు మొదటి రోజు మంచి వసూళ్లు మంచిగానే రాబడుతోంది. ఇలా ఇప్పటికే పది కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసింది. తద్వారా సెమీ హిట్ స్టేటస్‌ను చేరుకుంది.
ఊరమాస్ స్టోరీతో హై యాక్షన్‌తో రూపొందిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు మంచి పోటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో నెట్‌ఫ్లిక్స్ సంస్థ వీటిని సొంతం చేసుకుంది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్నే అందజేసింది. ఇక, ఈ సినిమా స్ట్రీమింగ్‌పై ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ సంస్థ సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌మెంట్ చేసేసింది.

మాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాను జూన్ 14వ తేదీ నుంచే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ తాజాగా ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను గత అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చింది. తద్వారా రెండు వారాలకే ఓటీటీలోకి ఈ చిత్రం వచ్చినట్లు అయింది. దీంతో విశ్వక్ సేన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఊరమాస్ యాక్షన్‌తో రూపొందిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా.. అంజలి, నాజర్ కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











