పాన్ ఇండియా మూవీ తీస్తే గల్లీ సినిమాయే.. మళ్లీ విజయ్ దేవరకొండను కెలికిన విశ్వక్ సేన్.. కామెంట్స్ వైరల్!
హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా రాణిస్తున్న యువ నటుడు విశ్వక్ సేన్ మరో అవతారం ఎత్తబోతున్నాడు. తెలుగులో ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారం కాబోతున్న ఫ్యామిలీ ధమాకా రియాలిటీ షోకు హోస్ట్‌గా విశ్వక్ సేన్ వ్యవహరించబోతున్నాడు. రియాలిటీ షో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మీడియా సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్, నాన్ సబ్ స్క్రిప్షన్ రెవెన్యూ బిజినెస్, కంటెండ్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని, ఫ్రిమాంటల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఆరాధన బోలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ..

ఆహా ఓటీటీ నిర్వాహకులు లాంచ్ చేస్తున్న ఫ్యామిలీ ధమాకా షోతో నేను హోస్ట్‌గా మారటం మరచిపోలేని అనుభూతి. హోస్ట్‌గా వ్యవహరించడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ షో ద్వారా ఎన్నో కుటుంబాలను కలవడం చాల ఆనందంగా ఉంది. తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్షకులకు అందించటానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని విశ్వక్ సేన్ అన్నారు.
మనమందరం మేధావులం అనుకొని చాలా పెద్ద లెక్కలు వేసుకొంటాం. పాన్ ఇండియా సినిమా తీద్దామనుకొంటే.. అది గల్లీ సినిమా అవుతుంది. కొన్నిసార్లు చిన్న సినిమా తీస్తాం కానీ పాన్ ఇండియా మూవీ అవుతుంది. కంతారా మూవీని వారు చిన్న సినిమాగా తీశారు. కానీ అది పాన్ ఇండియా మూవీ అయింది. సినిమాల పరంగా ప్లానింగ్ చేసుకొంటూ పోవాలే తప్పా.. భారీగా స్కెచ్‌లు వేయకూడదు అని విశ్వక్ సేన్ అన్నారు.

నేను తీసే సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టిగా కొడుతుంది. ఇంట్లో కూర్చొని ఈ సినిమా 100 కోట్లు కొడుతుంది. ఈ సినిమా 200 కోట్ల రూపాయలు కొడుతుందని లెక్కలేసే మేధావిని కాదు. కానీ నేను పెద్ద సినిమా చేయాలి. పాన్ ఇండియా లెవెల్ హీరో కావాలనేంతగా కష్టపడుతాను. ప్రతీ సినిమాకు అలాగే కష్టపడుతాను అని విశ్వక్ సేన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అయితే విశ్వక్ సేన్ ఇటీవల విజయ్ దేవరకొండను పరోక్షంగా టార్గెట్ చేస్తున్నారనే విషయం పలుమార్లు మీడియాలో స్పష్టమైంది. అయితే లైగర్ సినిమా విషయంలో మా సినిమా 200 కోట్లు కొడుతుందని ట్వీట్ చేయడం తెలిసిందే. ఆ ట్వీట్ గురించి పరోక్షంగా కామెంట్ చేస్తూ విజయ్ దేవరకొండను కెలికాడనే సినీ, మీడియా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. విశ్వక్ సేన్ స్చీచ్‌కు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా, ఫ్యామిలీ ధమాకా ఆహా ఓటీటీలో సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ప్రతీ శుక్రవారం రియాలిటీ షోకు సంబంధించిన ఎపిసోడ్ రాత్రి 8 గంటలకు స్ట్రీమింగ్ కానున్నది. ఫ్యామిలీ ధమాకా రియాలిటీ షో ప్రేక్షకులకు భావోద్వేగాలను పంచే రోలర్ కోస్టర్ షోగా ఉంటుంది. ఇప్పటి వరకు రాని కంటెంట్‌తో ఈ షో ఉంటుంది అని నిర్వాహకులు వాసుదేవ్ కొప్పినేని, ఆరాధన బోలా వెల్లడించారు.


Click it and Unblock the Notifications











