Laila OTT Release: ఓటీటీలోకి విశ్వక్‌సేన్ డిజాస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?
ఈ మధ్యకాలంలో బాగా వివాదాస్పదమైన చిత్రం ఏదైనా ఉందంటే అది మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ నటించిన లైలా. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌తో మొదలైన గొడవ సినిమా రిలీజ్ అయి అది డిజాస్టర్‌గా నిలిచే వరకు కొనసాగింది. థియేటర్‌లో విడుదల అయ్యాక సినిమాపై , హీరో విశ్వక్‌సేన్‌పై విపరీతంగా ట్రోలింగ్ నడిచింది. ఇలాంటి సినిమాలు మళ్లీ చేయనని స్వయంగా ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు విశ్వక్‌సేన్. ఇన్ని కాంట్రవర్సీలకు కారణమైన ఈ లైలా సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ వివరాల్లోకి వెళితే..
హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్న విశ్వక్‌సేన్ తన కెరీర్‌లోనే తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం లైలా. ట్రైలర్, టీజర్, లేడీ గెటప్‌లో ఉన్న విశ్వక్‌సేన్ లుక్స్‌కు మంచి స్పందన రావడంతో చిత్ర యూనిట్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 30 ఇయర్స్ పృథ్వీ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అవి తమ పార్టీ, తమ అధినేతను ఉద్దేశించి చేసినవేనంటూ వైసీపీ శ్రేణులు మండిపడ్డాయి. లైలాను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్‌కు దిగాయి.

జరగబోయే నష్టాన్ని ఊహించిన హీరో విశ్వక్‌సేన్, నిర్మాత సాహూ గారపాటిలు మీడియా ముందుకొచ్చి వైసీపీ శ్రేణులకు క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత పృథ్వీరాజ్ కూడా సారీ చెప్పడంతో వివాదం ముగిసింది. ఇన్ని అడ్డంకులను దాటుకుని ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం నాడు లైలా విడుదలైంది. అయితే తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది లైలా. అన్నింటికి మించి బూతు మాటలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ప్రేక్షకులకు విసుగు పుట్టించాయి. చివరికి విశ్వక్‌సేన్‌కు మచ్చ తీసుకురావడంతో పాటు ఆయన కెరీర్‌లోనే డిజాస్టర్‌గా లైలా నిలిచింది. దీంతో స్వయంగా విశ్వక్‌సేన్ ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతూ లేఖ రాశారు.
ఇకపై తన సినిమాలు, సన్నివేశాలు మనసుల్ని హత్తుకునేలా ఉంటాయని చెప్పారు. అసభ్యతకు తావు లేకుండా సినిమాలు చేస్తానని విశ్వక్ తెలిపారు. తన సినిమాపై వచ్చిన విమర్శలను అంగీకరిస్తున్నానని ఆయన చెప్పారు. ఇప్పటికీ లైలా తాలూకా గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లైలా సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. విడుదలై నెల రోజులు కాకముందే ఓటీటీలోకి రావడం విశ్వక్‌సేన్ అభిమానులను నిరాశకు గురిచేసింది.

తెలుగులో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాంగా ఉన్న ఆహాలో ఈ నెల 7 నుంచి లైలా సినిమా స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు అధికారికంగా అనౌన్స్‌మెంట్ కూడా చేసింది. థియేటర్‌లలో డిజాస్టర్‌గా నిలిచిన పలు సినిమాలు ఓటీటీలో దుమ్మురేపిన నేపథ్యంలో లైలా కూడా సంచలన విజయాన్ని అందుకుంటుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?


Click it and Unblock the Notifications











