OTT లోకి వచ్చేసిన విశ్వక్ సేన్ హీరోయిన్ క్రైమ్ థ్రిల్లర్... స్ట్రీమింగ్ ఎందులో అంటే?

ఓటీటీ కంటెంట్ కు ప్రేక్షకులు బాగా అలవాటు పడిపోయారనే చెప్పాలి. వారం వారం ఇంట్లోనే కూర్చొని ఓటీటీలో ప్రతివారం సినిమాలు, వెబ్ సీరిసులు చూసేస్తున్నారు. ఇక వారం అలరించేందుకు ఓటీటీ సంస్థలు కూడా కొత్త కొత్త సినిమాలు, వెబ్ సీరిసులు తీసుకువచ్చాయి. ఇక ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. డిఫరెంట్ జోనర్ కోరుకునే వారికోసమే ఈ సీరిసును తెరకెక్కించారు మేకర్స్. విశ్వక్ సేన్ హీరోయిన్ నివేద పేతురాజ్ నటించిన ఈ వెబ్ సీరిస్ ఓటీటీలో రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. ఆ వివరాల్లోకి వెళితే...

థియేటర్ కి వెళ్లి చూసే ఓపిక లేని మూవీ లవర్స్ కోసం.. ఓటీటీ సంస్థలు కొత్త కొత్త కంటెంట్ ను తీసుకువస్తున్నాయి. ఇక ఈ వారం కూడా ఓటీటీలోకి ఎన్నో కోత్త సినిమాలు, వెబ్ సీరిసులు వచ్చేశాయి. ఇప్పటికే ఓటీటీలోకి బెదురులంక సినిమా సడెన్ గా ప్రత్యక్షం అయింది. ఈ సినిమాకు థియేటర్లో మంచి టాక్ సంపాదించుకుని వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ రాబడుతుందో వేచి చూడాలి.

Vishwaksen Heroine Nivetha Pethuraj Kaala Crime Thriller Web Series Streaming Now on Disney Plus Hotstar Ott

ఇక తాజాగా ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సీరిస్ వచ్చేసింది. ఇక స్టార్ నటీనటులు, డైరెక్టర్లు లేకపోయినా.. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. అయితే విశ్వక్ సేన్ సినిమాల్లో నటించిన హీరోయిన్ నివేద పేతురాజ్ ఇప్పుడు డిజిటల్ కంటెంట్ లోకి అడుగుపెట్టింది. తను నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబర్ సీరిస్ కాలా ఓటీటీలోకి స్ట్రీమింగ్ వచ్చేసింది. ఇక ఈ సీరిసుకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అయితే లభిస్తోంది.

హీరోయిన్‌ నివేదా పేతురాజ్... మెంటల్‌ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అలా వైకుంఠపురం, రెడ్, పాగల్‌, విరాటపర్వం వంటి సూపర్‌హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది విష్వక్‌సేన్‌ నటించిన దాస్ కా ధమ్కీ చిత్రంలో నివేదా నటించింది. ఇప్పుడు కాలా అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. అవినాష్‌ తివారీ హీరోగా నటించిన ఈ సిరీసులో ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్‌ నివేద నటించింది.

Vishwaksen Heroine Nivetha Pethuraj Kaala Crime Thriller Web Series Streaming Now on Disney Plus Hotstar Ott

ఇక కాలా వెబ్ సీరిసులో రోహన్‌ వినోద్‌ మెహ్రా, నితిన్‌ గులాటి, అనిల్ ఛటర్జీ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్నీప్లస్‌ హాట్‌ స్టార్‌ లో కాలా వెబ్ సీరిస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సీరిస్ హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇక ఈ సీరిసుకు బిజాయ్‌ నంబియార్‌ దర్శకత్వం వహించారు. ప్రముఖ టీ- సిరీస్‌ బ్యానర్‌ పై భూషణ్‌ కుమార్‌, కిషణ్‌ కుమార్‌, బిజాయ్‌ నంబియార్‌ సంయుక్తంగా నిర్మించారు.

Vishwaksen Heroine Nivetha Pethuraj Kaala Crime Thriller Web Series Streaming Now on Disney Plus Hotstar Ott

కాలా వెబ్ సీరిస్ విషయానికి వస్తే.. ఇదో యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సీరిస్. ఇందులో హీరోయిన్ నివేదా పేతురాజ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో నటించింది. పలు యాక్షన్‌ సన్నివేశాల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం నివేద చేతిలో తెలుగు, తమిళ కొత్త సినిమాలతో పాటు.. ఓ తెలుగు వెబ్ సీరిస్ కూడా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X