Malli Pelli OTT: ఓటీటీలోకి నరేష్ పవిత్ర 'మళ్లీ పెళ్లి'.. అందులో ముందుగానే స్ట్రీమింగ్!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు పొందారు వీకే నరేష్. సపోర్టింగ్ క్యారెక్టర్స్ పోషిస్తూ ఆకట్టుకున్నారు. అయితే ఆయన వ్యక్తిగత విషయాలు కథాంశంగా తాజాగా తెరకెక్కిన సినిమా మళ్లీ పెళ్లి (Malli Pelli). నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రలుగా రూపొందిన ఈ సినిమా మే 26న విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. మరి ఈ నేపథ్యంలో మళ్లీ పెళ్లి ఓటీటీ హక్కులు, దాని విడుదల తేదిపై ఆసక్తి నెలకొంది. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ మళ్లీ పెళ్లి సినిమా ఓ ఓటీటీలోకి రానుందనే వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేష్ (VK Naresh), పవిత్ర లోకేష్ (Pavitra Lokesh) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ మళ్లీ పెళ్లి (Malli Pelli). విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకనిర్మాత ఎమ్ఎస్ రాజు దర్శకత్వం వహించారు. పవిత్ర లోకేష్ తో కిస్సింగ్, పెళ్లి వీడియోలతో మొదలైన ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగాయి. డిఫరెంట్ తరహాలో ప్రమోషన్స్ నిర్వహించి సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. అంతేకాకుండా ఈ సినిమా నుంచి వదిలి ట్రైలర్ మరింత ఆసక్తి పెంచేసింది.

అయితే తెలుగు, కన్నడ భాషల్లో నరేష్, పవిత్ర నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మళ్లీ పెళ్లి సినిమా ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఎంఎస్ రాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మే 26న రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో నరేష్, పవిత్రల మధ్య ఉన్న రిలేషన్ ఎక్కడి నుంచి ఎలా మొదలైంది ఏంటీ అనే విషయాలు మళ్లీ పెళ్లిలో చూపించినట్లుగా తెలుస్తోంది. పవిత్ర లోకేష్ ఎదుర్కున్న సమస్యలు తదితర అంశాలతో చిత్రీకరించినట్లుగా రివ్యూలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మళ్లీ పెళ్లి (Malli Pelli OTT Rights) సినిమా ఓటీటీ పార్టనర్ పై ఆసక్తి నెలకొంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో చేజిక్కించుకుంది. అంటే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటి వరకు ఓటీటీ రీలిజ్ డేట్ ఖరారు కాలేదు కానీ సినిమాకు వచ్చే స్పందన బట్టి ప్రకటిస్తారని సమాచారం. ఇప్పటికైతే నెల కంటే ముందుగానే ఓటీటీలో రిలీజే చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక మళ్లీ పెళ్లి సినిమాలో ఇటీవల మరణించిన శరత్ బాబు చివరిసారిగా కనిపించారు. అన్నపూర్ణ, భద్రం తదితరులు నటించారు. మళ్లీ పెళ్లి సినిమా మొత్తంగా నరేష్, పవిత్ర లోకేష్, వనితా విజయ్ కుమార్ చుట్టే తిరుగుతుందని టాక్. సినిమాకు అరుళ్ దేవ్, సురేష్ బొబ్బిలి స్వరాలు అందిచగా.. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.


Click it and Unblock the Notifications











