Vyavastha Web Series Review ట్విస్టులతో ఆకట్టుకొనే కోర్టు డ్రామా.. సంపత్ రాజ్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

Rating: 2.75/5

నటీనటులు: సంపత్ రాజ్, హెబ్బా పటేల్, కార్తీక్ రత్నం, కామా జఠ్మలానీ, గురు రాజ్ తదితరులు
దర్శకత్వం: ఆనంద్ రంగా
నిర్మాత: పట్టాబీ ఆర్ చిల్కూరి
మ్యూజిక్: నరేష్ కుమార్
సినిమాటోగ్రఫి: అనిల్ భండారీ
ఎడిటర్: ఆది నారాయణ్
ఓటీటీ రిలీజ్: జీ5
ఓటీటీ రిలీజ్: 2023-04-28

వ్యవస్థ కథ ఏమిటంటే? :శోభనం రాత్రి భర్త అజయ్‌ను చంపారనే అభియోగంపై యామిని (హెబ్బా పటేల్)ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. నగరంలో టాప్ మోస్ట్ లాయర్ చక్రవర్తి ( సంపత్ రాజ్) వద్ద జూనియర్‌గా వంశీ (కార్తీక్ రత్నం) పనిచేస్తుంటాడు. రిమాండ్ ఖైదీ యామినికి వ్యతిరేకంగా లాయర్ చక్రవర్తి కేసు వాదిస్తుంటాడు. అయితే తన బాస్ చక్రవర్తి వద్ద నుంచి తప్పుకొని.. యామినికి అనుకూలంగా వంశీ కేసు వాదించాలని నిర్ణయం తీసుకొంటాడు. తన వద్ద పనిచేసే జూనియర్ వంశీ తనకు వ్యతిరేకంగా కేసు వాదించాలని నిర్ణయించుకోవడంతో చక్రవర్తి కోపంతో ఊగిపోతాడు. వంశీ తన కేసు ఎలా గెలుస్తాడో చూస్తాను అంటూ చక్రవర్తి సవాల్ విసురుతాడు.

Vyavastha Web Series Review and Rating: Samapath Raj, Karthik Ratnam and Hebah Patel steal the stream

వ్యవస్థ కథ ట్విస్టులు:శోభనం గదిలో భర్తను యామిని ఎందుకు కాల్చి చంపింది? భర్తను యామిని చంపిందా? లేదా మరెవరైనా చంపారా? యామిని కేసును చక్రవర్తి ఎందుకు వాదించాలనుకొన్నాడు? యామిని కేసును వంశీ వాదించడానికి కారణం ఏమిటి? యామిని కేసును చక్రవర్తి ఎందుకు ప్రిస్టేజ్‌గా తీసుకొన్నాడు? శోభనం గదిలో అసలు ఏం జరిగింది? యామినికి వంశీకి ఉన్న సంబంధం ఏమిటి? సీనియర్ లాయర్‌ను ఎదురించి వంశీ కేసు గెలిచాడా? యామినికి శిక్ష పడిందా? లేదా విడుదలైందా? కేసు వాదించడానికి వంశీ ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే వ్యవస్థ వెబ్ సిరీస్ కథ.

వ్యవస్థ ఎలా సాగిందంటే? :పెళ్లి తర్వాత శోభనం గదిలోకి వెళ్లిన యామిని కేక పెట్టడం.. భర్త అజయ్ నేలపై నెత్తురు మడుగులో పడి ఉండటంతో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. తొలి సీన్‌లోనే ట్విస్టుతో సీరిస్ ఆరంభం కావడంతో ఏం జరగబోతుందనే క్యూరియాసిటీని దర్శకుడు ఆనంద్ రంగా క్రియేట్ చేశాడని చెప్పవచ్చు. యామినికి శిక్ష పడేలా వాదించాలనుకొన్న చక్రవర్తికి వంశీ రంగంలోకి దిగి షాకిస్తాడు. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్‌లో కథ మొదలై నిదానంగా సాగుతుంది. యామినితో వంశీ వన్ సైడ్ లవ్ ట్రాక్ ఫీల్‌గుడ్‌గా సాగుతుంది.

Vyavastha Web Series Review and Rating: Samapath Raj, Karthik Ratnam and Hebah Patel steal the stream

వ్యవస్థ క్లైమాక్స్‌ ఎలా ముగిసిందంటే..:వ్యవస్థ వెబ్ సిరీస్‌లో ఎపిసోడ్స్ సాగినకొద్ది కథను సాగదీసినట్టు అనిపిస్తుంది. రకరకాల అంశాలను కథలోకి తీసుకురావడం వల్ల అసలు కథ పక్కకు వెళ్లినట్టు ఫీలింగ్ కలుగుతుంది. కానీ చివరి రెండు ఎపిసోడ్స్‌లో కథను ట్రాక్‌పైకి తెచ్చి ఇంట్రెస్టింగ్‌గా మలిచారనపిస్తుంది. వంశీ పాయింట్ ఆఫ్ వ్యూలో కథను ఫినీష్ చేయడం బాగుంది. చక్రవర్తి క్యారెక్టర్‌ను డిఫరెంట్‌ షేడ్స్‌లో డిజైన్ చేయడం సిరీస్‌కు పాజిటివ్ అంశంగా మారింది.

నటీనటుల ఫెర్ఫార్మెన్స్ గురించి:చక్రవర్తిగా ఫుల్ లెంగ్త్ నెటిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్‌లో సంపత్ రాజ్ ఒదిగిపోయాడు. చాలా సన్నివేశాల్లో సంపత్ రాజ్ బాడీ లాంగ్వేజ్ ఎక్ట్రార్డినరీగా ఉంది. వెబ్ సిరీస్ భారాన్ని మొత్తాన్ని తన మీద వేసుకొని సంపత్ రాజ్ పాజిటివ్‌గా మలిచాడు. ఇక కార్తీక్ రత్నం డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను చాలా సమర్ధవంతంగా పోషించాడు. లవర్ బాయ్‌గా, స్టూడెంట్‌గా, జూనియర్ లాయర్‌గా మంచి హావభావాలను పలికించాడు. యామినిగా హెబ్బా పటేల్ కథకు సెంటర్ పాయింట్ పాత్రలో కనిపించింది. కానీ ఆమె అతిథి పాత్రకు ఎక్కువ.. మెయిర్ క్యారెక్టర్‌కు తక్కువ అనేలా ఉంటుంది. ఉన్నంత వరకు మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నది. కోర్టులో పీపీగా వేణుగోపాల్ రావు చక్కని నటనను ప్రదర్శించాడు. కథను మలుపు తిప్పే సన్నివేశాల్లో గుర్తుండిపోయేలా నటించాడు.

Vyavastha Web Series Review and Rating: Samapath Raj, Karthik Ratnam and Hebah Patel steal the stream

టెక్నికల్‌గా ఎలా ఉందంటే? :సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. వ్యవస్థ వెబ్ సిరీస్‌కు నరేష్ కుమార్ అందించిన మ్యూజిక్ ప్లస్ పాయింట్ అయింది. చాలా సన్నివేశాలను తన రీరికార్డింగ్‌తో ఎలివేట్ చేశారు. అనిల్ భండారీ సినిమాటోగ్రఫి బాగుంది. కోర్టు రూమ్ డ్రామాను ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఆది నారాయణ్ ఎడిటింగ్ బాగుంది. మంచి కథతో వెబ్ సిరీస్ రూపొందించిన పట్టాభీ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనాలపై ఇంకాస్త దృష్టిపెట్టాల్సి ఉందనిపిస్తుంది.

Vyavastha Web Series Review and Rating: Samapath Raj, Karthik Ratnam and Hebah Patel steal the stream

ఫైనల్‌గా ఎలా ఉందంటే? :లవ్, రివేంజ్, ఎమోషనల్ అంశాలతో రూపొందిన కోర్టు రూమ్ డ్రామా వ్యవస్థ. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌కు కావాల్సిన ఎలిమెంట్స్‌తో రూపొందింది. కానీ కాస్త నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. ట్విస్టులు కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇస్తుంది. సంపత్ రాజ్, కార్తీక్ రత్నం, హెబ్బా పటేల్ ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకొనేలా ఉంటాయి. జీ5 స్ట్రీమింగ్ అవుతున్నది కాబట్టి.. తీరిక వేళ్లలో హ్యాపీగా ఈ వెబ్ సిరీస్‌ను ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X