OTTలోకి వచ్చేస్తున్న వ్యూహం.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ సంస్థలు.. ఇటీవల కాలంలో ప్రేక్షకుల టెస్టుకు తగ్గట్లు కొత్త కొత్త కంటెంట్ ను తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా డైరెక్టుగా ఓటీటీల్లోనే సినిమాలు రిలీజ్ చేయడం.. వెబ్ సిరీసులు తీసుకురావం చేస్తున్నాయి. అలా మరో కొత్త కంటెంట్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది. వెబ్ సీరిసులుకున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని తెలుగులో కూడా నిర్మాణ సంస్థలు వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్నాయి. ఇక స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం వాటిలో నటించడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు తాజాగా వ్యూహం అనే వెబ్ సిరీసు రిలీజ్ కు సిద్ధంగా ఉంది.ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రస్తుతం ఓటీటీ వెబ్ సిరీసులకు ప్రత్యేక క్రేజ్ ఉందనే విషయం తెలిసిందే. ఓటీటీల్లో ఒకప్పుడు హిందీలో వెబ్ సిరీసులు ఎక్కువగా వచ్చేవి. ఇక ఈ సిరీస్‌లు ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రూపొందుతున్నాయి. తెలుగులో కూడా ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మిస్తుంటే... స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు సైతం నటిస్తున్నారు.

మొన్నటి వరకు సమంత ది ఫ్యామిలీమెన్, నాగ చైతన్య దూత వంటి వెబ్ సిరీసుల్లో నటించిన సంగతి తెలిసిందే. అవే కాకుండా నిత్యమీనన్ కుమారి శ్రీమతి, మోడర్న్ లవ్ హైదరాబాద్, హాస్టల్ డేస్, రానా నాయుడు, సైతాన్, రెక్కీ వంటి తెలుగు వెబ్ సిరీసులు ప్రేక్షకులను అలరించాయి. ఈ కోవలోనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఓటీటీ లవర్స్ ముందుకు రాబోతుంది.
ఆ వెబ్ సిరీస్ పేరు వ్యూహం. ఈ పేరు విని.. ఆర్జీవీ తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమా అనుకుంటే పొరపాటే. అది పొలిటకల్ జోనర్లో తెరకెక్కుతుండగా.. ఈ వ్యూహం వెబ్ సిరీస్.. ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతుంది.ఈ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీసును అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియా యార్లగడ్డ నిర్మించారు. ఈ సిరీస్‌లో సాయి సుశాంత్ రెడ్డి, చైతన్య కృష్ణ, పావని గంగిరెడ్డి, రవీంద్ర విజయ్, శశాంక్ సిద్దంశెట్టి కీలక పాత్రల్లో నటించారు.

శశికాంత్ శ్రీవైష్ణవ్ పీసపాటి దర్శకత్వం వహించగా.. ఈ సిరిస్ రిలీజ్ కు రెడీ అయిపోయింది. వ్యూహం సిరీస్ డిసెంబర్ 14వ తేదీన ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మరొకొత్త వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిందని.. మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దాంతో పాటు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అది ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
ఇక ఈ వెబ్ సీరిస్ విషయానికి వస్తే... ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ ఈ కథ ఉంటుందని తెలుస్తోంది. న్యాయం కోసం అతను చేసే పోరాటం... ఈ క్రమంలో అతడు ఎదుర్కొనే సవాళ్లు ఏంటి అనేది ఈ వెబ్ సిరీసును చూసి తెలుసుకోవాల్సిందే. మరో కొత్త ఇన్వేస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీసును చూడాలనుకుంటే.. దీన్ని మిస్ అవ్వకండి. ఇంట్లోనే కూర్చొని.. ఎంచాక్క ఓటీటీలో వ్యూహం చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











