War 2 OTT: ఓటీటీలోకి వార్ 2 .. ఎన్టీఆర్, హృతిక్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, గ్లోబర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వార్ 2. ఈ ఏడాది భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ అవైటెడ్ మూవీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇదే రోజున సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ కూడా విడుదల కావడంతో వార్ 2పై అంచనాలు పెరిగాయి. కూలీని ఈ సినిమా ఎలా ఢీకొడుతుంది? వార్ 2 కథేంటీ? ఇద్దరు హీరోలను అయాన్ ముఖర్జీ ఎలా డీల్ చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో వార్ 2 ఓటీటీ రిలీజ్‌పైనా చర్చ జరుగుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
వార్ 2 బడ్జెట్ ఎంత?
గతంలో వచ్చిన వార్‌కు సీక్వెల్‌గా వార్ 2 చిత్రాన్ని తెరకెక్కించారు. బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించారు. వార్ 2కి శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే, అబ్బాస్ టైర్‌వాలా సంభాషణలు అందించారు. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫిని, ప్రీతమ్ పాటలు, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హార బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. వార్ 2కు ఆరీఫ్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు అందిస్తున్నారు. ఈ సినిమాను దాదాపుగా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

వార్ 2 బిజినెస్ ఎంత
యశ్ రాజ్ ఫిలింస్ : స్పై యూనివర్స్‌కు ఉన్న క్రేజ్‌కు తోడు ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడం, ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగిన విధంగానే వార్ 2కి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వార్ 2 హిందీ వెర్షన్‌ను ఉత్తర భారతదేశంలో యష్ రాజ్ ఫిలింస్ సొంతంగా రిలీజ్ చేస్తున్నది. ఈ సినిమాను థియేట్రికల్ రైట్స్ బిజినెస్‌ను సుమారుగా 175 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు ట్రేడ్ పండితులు.
వార్ 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఎన్టీఆర్ నటించడంతో తెలుగు రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌కు విపరీతంగా పోటీ నెలకొంది. వార్ 2 థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సుమారుగా 90 కోట్ల రూపాయల (జీఎస్టీతో కలిపి 105 కోట్లు)కు కొనుగోలు చేశారు. అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 19 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 56 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. దాంతో వార్ 2 మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 340 కోట్ల రూపాయల మేర జరిగింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 350 కోట్ల రూపాయల షేర్, 700 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. భారీ అంచనాల నేపథ్యంలో వార్ 2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 10000 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు.
వార్ 2 ఏ ఓటీటీలో?
ఇంతటి భారీ అంచనాలున్న వార్ 2 మూవీని ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే ఒప్పందం మీద ఈ మూవీ ఓటీటీ డీల్ కుదిరినట్లుగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిని బట్టి వార్ 2 చిత్రం సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారం ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే థియేట్రికల్ రన్‌ను బట్టి వార్ 2 ఓటీటీ రిలీజ్ ఆలస్యం కావొచ్చు లేదంటే ముందుగానే రావొచ్చు. త్వరలోనే వార్ 2 ఓటీటీపై నెట్‌ఫ్లిక్స్ కీలక ప్రకటన చేయనుంది.


Click it and Unblock the Notifications











