తెలుగు ఇండియన్ ఐడల్ సెట్స్ లో వివాదం.. నిత్య మీనన్, థమన్ మధ్య మాటల యుద్ధం?
ఆ మధ్య తరచూ కాపీ వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన థమన్ ఈ మధ్య కాలంలో అలాంటి వార్తల్లోకి ఎక్కడం లేదు. అయితే ఆయన చేస్తున్న అన్ని సినిమాలు హిట్ లు అవుతూ ఉండడంతో మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే ఆయన వార్తల్లోకి ఎక్కాడు. ప్రస్తుతం తెలుగు ఇండియన్ ఐడల్ అనే షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు తమన్ తన తోటి న్యాయనిర్ణేత అయిన నిత్యమీనన్ తో వాగ్వాదానికి దిగినట్టు వార్తలు వస్తున్నాయి.. వివరాల్లోకి వెళితే

తెలుగులో కూడా
ఇండియన్ ఐడల్ అనే షోకి ఉన్న ప్రత్యేకమైన క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రతిభ ఉండి దానిని బయట పెట్టడానికి అవకాశం లేని యువ గాయనీ గాయకులను వెలుగులోకి తెస్తోన్న ఈషోకు ఉన్న ప్రేక్షకాదరణ ఒక రేంజ్ లో ఉంటుంది. అందుకే హిందీలో ఈషో ఇప్పటివరకు పన్నెండు సీజన్లు పూర్తిచేసుకుంది. కాగా ఇలాంటి సింగింగ్ కాంపిటీషన్ షో తెలుగు ప్రేక్షకులకూ కూడా ఉంటే తెలుగు యువ గాయని గాయకులు తెలుగులో కూడా రాణించే అవకాశం ఉందని భావించి అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా.

తెలుగు ఇండియన్ ఐడల్ షో
తెలుగు ఇండియన్ ఐడల్ షో పేరుతో ఓ మ్యూజిక్ కాంపిటీషన్ షోను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తోంది. గతంలో ఇండియన్ ఐడల్‌గా నిలిచిన ప్రముఖ సింగర్ శ్రీరామచంద్ర ఈ షోను హోస్ట్ చేస్తుండగా థమన్, నిత్యా మీనన్, కార్తీక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. గాయనీ గాయకుల మధురమైన పాటలు, జడ్జీల కామెడీ, పంచ్ డైలాగులతో ఎంతో ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమం సాగుతోంది. అయితే ఈ షో ఇప్పుడు మొదటి సీజన్ చివరికి వచ్చేసింది.

డబుల్ ధమాకా స్పెషల్ రౌండ్
ఆహా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో తెలుగు ఇండియన్ ఐడల్ టాలెంట్ హంట్ షోకి న్యాయనిర్ణేతలుగా ఉన్న నటి నిత్యా మీనన్ - సంగీత స్వరకర్త తమన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. షో నిర్వాహకులు రిలీజ్ చేసిన ప్రకారం ఈ పాపులర్ షో డబుల్ ధమాకా స్పెషల్ రౌండ్ సందర్భంగా నిత్య మరియు తమన్‌ల మధ్య కంటెస్టెంట్ మారుతిపై అభిప్రాయ భేదాలు వచ్చాయి.

వాదన
ఇద్దరి మధ్య కొంత వాదన జరిగింది. షోకి మరో న్యాయనిర్ణేతగా కూడా ఉన్న గాయకుడు కార్తీక్ మొదట్లో నిత్యాకు మద్దతు ఇస్తున్నట్టే కనిపింహిచింది కానీ తరువాత మనసు మార్చుకున్నాడు. దీంతో నిత్య మరింత బాధ పడింది. MCA సినిమా నుంచి ఏవండోయ్ నాని గారు అనే పాట పాడిన సమయంలో వీరి మధ్య వాదన జరిగింది.

భారీ ప్రైజ్ మనీ
ఇక ఈ షోలో గెలిచిన వారికి తెలుగు ఇండియన్ ఐడల్ టైటిల్‌తో పాటు భారీ ప్రైజ్ మనీ లభిస్తుంది. ఇక ఈ షో ద్వారా అనేక మంది ప్రతిభ గల గాయనీ గాయకులూ తెర మీదకు వస్తున్నారు. ఈ షోలో కంటెస్టెంట్ లు మొన్న ఏకంగా ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి సహా అందరి ముందు ఆచార్య సాంగ్స్ పాడి అలరించారు. ఇక ఒటీటీలో జరుగుతున్న ఈ రియాలిటీ షో అందరికీ దగ్గరవుతోంది,


Click it and Unblock the Notifications











