Who Is Vadapav Girl: బిగ్‌బాస్‌లోకి వడపావ్ గర్ల్.. ఎవరీ అందాల భామ?

మలయాళంలో బిగ్‌బాస్ సీజన్ ముగియగానే ఇతర భాషల్లో రియాలిటీ షోలు ప్రారంభమయ్యేందుకు రెడీ అవుతున్నాయి. తాజాగా హిందీలో బిగ్‌బాస్ హిందీ ఓటీటీ షో 3 సీజన్‌కు రంగం సిద్దమైంది. ఈ సీజన్ ప్రారంభానికి ముందే రకరకాలుగా అందరి అటెన్షన్‌ను క్రియేట్ చేసింది. అయితే సీజన్‌లో కామన్ మ్యాన్ కేటగిరిలో ఓ సాధారణమైన యువతిని ఈ షోలోకి తీసుకోవడం మరింత క్రేజీగా మారింది. ఈ షో గురించి ఆసక్తికరమైన వివరాల్లోకి వెళితే..

ఇప్పటి వరకు బిగ్‌బాస్‌కు సల్మాన్ ఖాన్ వన్ మ్యాన్ షో. గత 17 సీజన్లుగా ఆయన హోస్ట్‌గా కొనసాగుతున్నారు. అయితే ఓటీటీ షోకు మాత్రం తొలుత కరణ్ జోహర్‌ను హోస్ట్‌గా ప్రయోగం చేశారు. అయితే అది బెడిసి కొట్టడంతో మళ్లీ రెండో సీజన్‌కు సల్మాన్ ఖాన్‌ను హోస్టుగా తెచ్చారు. అయితే తాజాగా సల్మాన్‌ను పక్కన పెట్టి అనిల్ కపూర్‌ను హోస్ట్‌గా చేయడం పెద్ద చర్చకు దారి తీసింది.

Who Is Vadapav Girl Chandrika Gera Dixit entry into Bigg Boss Hindi OTT 3

ఇక బిగ్‌బాస్ హిందీ 3 ఓటీటీ షోలో తొలి కంటెస్టెంట్‌గా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ చంద్రిక గేరా దీక్షిత్‌ను ఎంపిక చేసి ఆశ్చర్యానికి గురి చేశారు. ఫుడ్ వ్లాగర్‌గా వీడియోలతో రికార్డు వ్యూస్ సాధించడమే కాకుండా డిజిటల్ మీడియాలోని డిఫరెంట్ ఫ్లాట్‌ఫాంలో భారీగా ఫాలోవర్స్‌తో ముందుకు సాగుతున్నారు.

ఉత్తరాది సోషల్ మీడియాలో చంద్రిక దీక్షిత్ అలియాస్ చంద్రిక గేరాకు వడపావ్ గర్ల్‌గా సుపరిచితులు. ముంబైలో ఫేమస్ అయిన వడాపావ్ పేరుతో ఆమెను అభిమానులు ముద్దుగా పిలచుకొంటారు. చంద్రిక దీక్షిత్ అంటే గుర్తుపట్టడం కష్టమే కానీ.. వడపావ్ గర్ల్ అంటే ఈజీగా గుర్తుపట్టేస్తారు.

Who Is Vadapav Girl Chandrika Gera Dixit entry into Bigg Boss Hindi OTT 3

ఇక బిగ్‌బాస్ ఓటీటీ షోలోకి వడపావ్ గర్ల్ వస్తుందనే వార్తల మధ్య ఆమె ఇటీవల ముంబై విమానాశ్రయంలో హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని విధంగా లుక్‌తో మీడియా కెమెరాలను ఆకర్షించారు. దాంతో ఆమె ఒక్కసారిగా టాప్ సెలబ్రిటీగా మారిపోయారు. ఇప్పుడు జాతీయ మీడియాలో వడపావ్ గర్ల్ చంద్రిక పేరు మార్మోగుతున్నది.

Who Is Vadapav Girl Chandrika Gera Dixit entry into Bigg Boss Hindi OTT 3

ఇక వడపావ్ గర్ల్ చంద్రిక గేరాకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్స్‌టాగ్రామ్‌లో ఆమెకు 3.6 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్ ఇతర మాధ్యమాల్లో కూడా భారీగా ఆదరణ ఉంది. ఇలాంటి పాపులారిటీ ఉన్న ఈ అందాల భామ బిగ్‌బాస్ ఓటీటీలో ఎలా రాణిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X