Dhurandhar 2 On OTT: ఓటీటీలో ధురంధర్ 2 అదిరిపోయే ట్విస్ట్.. స్ట్రీమింగ్ జాప్యానికి కారణమిదే..
ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ధురంధర్ ది రివేంజ్ చిత్రం గత 63 రోజులుగా జైత్రయాత్రను కొనసాగిస్తూనే ఉంది. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ మాటల్లో చెప్పలేని విదంగా ఉంది. బాలీవుడ్ సినిమాల అత్యధిక కలెక్షన్ల రికార్డులు, అలాగే స్టార్ హీరోల లైఫ్ టైమ్ వసూళ్ల రికార్డులను ఈ చిత్రం తిరగరాసింది. పాకిస్థాన్‌లో ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ లైఫ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోను సంచలన విజయాన్ని అందుకొన్నది. ఈ సినిమా 9 వారాలకు పైగా థియేట్రికల్ రన్ కొనసాగిస్తున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ విషయంలో జాప్యం జరిగింది. ఈ ఆలస్యానికి కారణం ఏమిటి? ఈ సినిమా ఓటీటీలో ఏ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవుతున్నదనే వివరాల్లోకి వెళితే..
ధురంధర్ సినిమా సృష్టించిన ప్రభంజనం తర్వాత మార్చి 19వ తేదీన రెండో పార్ట్ ధురంధర్ ది రివేంజ్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రీమియర్ల షో టాక్‌తో బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం రోజు రోజుకు కలెక్షన్ల రేంజ్ పెంచుకొంటూ భారతీయ సినిమా రంగంలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

ట్రేడ్ వెబ్‌సైట్ సాక్ నిక్ వెల్లడించిన ప్రకారం.. ధురంధర్ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1799 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఇండియాలో 1372 కోట్ల రూపాయల గ్రాస్, 1146 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను నమోదు చేసింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 427 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాట్టింది. దఈ చిత్రం 1800 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.
అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ కొనసాగిస్తూనే ఓటీటీలోకి వచ్చేందుకు ముస్తాబవుతున్నది. ఈ చిత్రంపై ఆడియెన్స్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ సంస్థలు పోటీకి పాల్పడ్డాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా, ఇండియన్ మార్కెట్‌లో జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకొన్నది. ఈ సినిమా జూన్ 19వ తేదీన స్ట్రీమింగ్ కావడానికి ఎన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
అయితే ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో మరో ట్విస్ట్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించి డిఫరెంట్ కట్‌తో స్పెషల్ స్ట్రీమింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ధురంధర్ ది రివేంజ్, రా, అన్‌దేఖా (Dhurandhar The Revenge, Raw & Undekha) వెర్షన్‌ను జూన్ 4వ తేదీన రాత్రి 7 గంటల నుంచి జన్ 5వ తేదీ వరకు స్ట్రీమింగ్ చేయనున్నట్టు జియో హాట్ స్టార్ వెల్లడించింది. ఈ వెర్షన్ ఆడియెన్స్‌కు థ్రిల్ చేసే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తున్నది.
ధురంధర్ ఫ్రాంచైజీ వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన తాజా భారీ బడ్జెట్ చిత్రం దురంధర్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాను సుమారుగా 450 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు.


Click it and Unblock the Notifications