Daaku Maharaaj OTT : డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ - బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న డాకు మహారాజ్‌తో బాలయ్య వరుసగా నాలుగో విజయాన్ని అందుకున్నాడు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు కూడా డాకు మహారాజ్ మంచి లాభాలను అందిస్తోంది. అయితే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.

సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇందు‌లో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్ , చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్‌లు ఇతర కీలక పాత్రలు పోషించారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

Why Has Nandamuri Balakrishna s Daaku Maharaaj s OTT Release been delayed

ఇక ఈ సినిమాపై భారీ అంచనాల నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. నైజాంలో రూ. 17.50 కోట్లు, రాయలసీమలో రూ.15.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.6 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.5 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ. 5.4 కోట్లు, గుంటూరులో రూ. 7.2 కోట్లు, నెల్లూరులో రూ.2.7 కోట్లు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 67.30 కోట్ల బిజినెస్ చేసింది డాకు మహారాజ్.

అలాగే ఓవర్సీస్‌లో రూ.8 కోట్లు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి రూ.5.40 కోట్లు మొత్తంగా రూ.80.70 కోట్లు బిజినెస్ చేసింది. ఇది ఇప్పటి వరకు బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. థియేట్రికల్ రన్ ముగిసేసరికి రూ.150 కోట్ల గ్రాస్ రాబట్టి.. చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

ఇదిలా ఉండగా .. డాకు మహారాజ్ కోసం ఓటీటీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను కళ్లు చెదిరే ధరకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు ఫిలింనగర్ టాక్. అయితే నెల రోజులు దాటుతున్నా ఈ సినిమా ఇప్పటి వరకు ఓటీటీలోకి రాకపోవడంతో బాలయ్య అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

Why Has Nandamuri Balakrishna s Daaku Maharaaj s OTT Release been delayed

ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే 50 రోజుల తర్వాత ఈ సినిమాను ఓటీటీకి తీసుకురావాలన్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిబంధనను డాకు మహారాజ్ నిర్మాతలు అమలు చేయాలని భావిస్తున్నారట. అలాగే డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన ఇతర భాషల డబ్బింగ్ కంటెంట్ ఇంకా నెట్‌ఫ్లిక్స్‌కు అందలేదని వార్తలు వస్తున్నాయి.

తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డబ్బింగ్ వర్క్స్ జరుగుతుండటం కూడా ఈ ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. సాంకేతిక సమస్యలను అధిగమించి డాకు మహారాజ్‌ను మార్చి మొదటి వారంలో ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X